Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: మందు తప్పని కుర్రాడు

By:  Tupaki Desk   |   21 Sept 2019 1:52 PM IST
టీజర్ టాక్: మందు తప్పని కుర్రాడు
X
ఇటీవలే విడుదలైన నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా మెప్పించిన యూత్ హీరో కార్తికేయ కొత్త చిత్రం 90 ఎంఎల్. శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీని హీరో స్వంత బ్యానర్ మీద ఆరెక్స్ 100 నిర్మాతలే ప్రొడ్యుజ్ చేస్తున్నారు. కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. కాళిదాసు లాంటి కొడుకు పుట్టాలని నాన్న కోరుకుంటే అమ్మ మొక్కుకున్నట్టు దేవదాస్ లాంటి వారసుడు(కార్తికేయ)ఆ ఇంటికి వస్తాడు.

మందు ముట్టనిదే రోజు గడవని ఇతని వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంటుంది. కాలేజీలో లెక్చరర్ క్వార్టర్ కొడతావా అని అడిగితే డాక్టర్ 90 ఎంఎల్ మాత్రమే కొట్టమన్నాడు అని చెప్పేంత లెవెల్ లో విచిత్రమైన అలవాటు ఉంటుంది. అసలు ఈ దేవదాస్ కు మందుకు కనెక్షన్ ఏంటి ఆదరైజ్డ్ డ్రింకర్ అని పేరు ఎలా వచ్చిందో తెలియాలంటే సినిమా చూడాలి. టీజర్ మాస్ కు నచ్చేలా ఆసక్తికరంగా కట్ చేశారు. విలన్ గా నటించిన అజయ్ మరో హాస్య పాత్రలో ఆలిని తప్ప ఇంకేవరిని ఇందులో రివీల్ చేయలేదు.

కార్తికేయ లుక్స్ పరంగా యాక్టింగ్ పరంగా మంచి ఎనర్జీతో కనిపించాడు. ఇందులో ఫైట్ ని హై లైట్ చేశారు. హీరొయిన్ గా పరిచయమవుతున్న నేహ సోలంకికి చూపించలేదు. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి బీట్స్ తో ఉండగా ఛాయాగ్రహణం సహా అన్ని విభాగాలు మంచి క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చేందుకు దోహదపడ్డాయి. రావు రమేష్ - రవి కిషన్ - పోసాని - అజయ్ - ఆలీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న 90 ఎంఎల్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది