Begin typing your search above and press return to search.

తొమ్మిది పాటలట.. విశేషాల పుట్టగా రౌడీ బాయ్స్!

By:  Tupaki Desk   |   14 Jan 2022 5:07 AM GMT
తొమ్మిది పాటలట.. విశేషాల పుట్టగా రౌడీ బాయ్స్!
X
సంక్రాంతి రేసులోకి అనూహ్యంగా వచ్చిన మూవీ రౌడీ బాయ్స్. సెలబ్రిటీ నిర్మాత దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ ఈ మూవీతో లాంఛ్ అవుతున్నాడు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ.. ఇంజనీరింగ్ వర్సెస్ మెడికల్ స్టూడెంట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుందట. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకు వచ్చింది. 145 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీలో ఏకంగా 9 పాటలు ఉన్న విషయాన్ని తాజాగా చిత్ర హీరో ఆశిష్ చెప్పుకొచ్చారు.

అన్ని పాటలు సందర్భానికి అనుగుణంగా వస్తాయని చెప్పుకొచ్చాడు. మొత్తం నిడివి 145 నిమిషాల్లో తొమ్మిది పాటలంటే.. ఒక్కో పాట తక్కువగా వేసుకున్న నాలుగు.. నాలుగున్న నిమిషాలు. అంటే.. సరాసరిన నాలుగునిమిషాల లెక్క వేసుకున్నా.. 36 నిమిషాలు ఈ సినిమాలో పాటలే ఉంటాయి. సాధారణంగా పాటలు ఎక్కువగా ఉన్న సినిమాలకు సంబంధించి.. మ్యూజికల్ గా మంచి పేరు ఉండాలి. కానీ.. రౌడీ బాయ్స్ కు సంబంధించిన ఇన్ని పాటలు ఉన్నప్పటికి పెద్దగా వైరల్ అయిన పాట ఒక్కటి లేదు. ఆన్ లైన్ బజ్ చూస్తే.. ఓకే అనిపించినా.. అందరూ మాట్లాడుకునేలా చేసిన ఒక పాట కూడా లేదు.

అలాంటివేళ.. తొమ్మిది పాటలతో సినిమాను ఎలా లాగిస్తాన్నది మరో ప్రశ్న. ఇక.. ఈ సినిమాకు ముందు హీరో ఆశిష్ చాలా బొద్దుగా ఉండేవాడట. చాలా కష్టపడి స్లిమ్ అయ్యాడట. అల్లు అర్జున్ తనకు స్పూర్తి అని చెప్పే ఆశిష్.. చిన్నప్పటి నుంచి మంచి డ్యాన్సర్ అని చెబుతారు అతని బాబాయ్ దిల్ రాజు. తమ ఇళ్లల్లో ఏదైనా పార్టీ జరిగితే.. ఆశిష్ డ్యాన్స్ వేసేవాడని చెబుతారు. న్యూయార్కు ఫిలిం కోర్సులు చేయటంతో పాటు.. సత్యానంద్.. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.

ఇక.. సినిమా కథ విషయానికి వస్తే.. దర్శకుడు హర్ష కాలేజీ టైంలో జరిగిన కథే.. రౌడీ బాయ్స్. అతను కథ చెబుతున్నప్పుడు థియేటర్ లో బోర్ కొట్టకుండా ఉంటుందని అనిపించిందని.. అందుకే సినిమాను ఓకే చేసినట్లు దిల్ రాజు చెబుతన్నారు. ఆశిష్ డ్యాన్సులు ప్రేక్షకుల్ని ఆకట్టుకకోవటం.. థియేటర్ లోకూర్చున్న వారిని నవ్వించటం.. ఎమోషనల్ సీన్స్ లు చేయటం లాంటి అన్ని ఉండాలనుకున్నామని.. అవన్నీ ఉన్నట్లు చెబుతున్నారు దిల్ రాజు. తన సోదరుడి కొడుకును పెద్ద దర్శకుడితో లాంచింగ్ చేయొచ్చని.. కానీ.. తాను తన కెరీర్ ను చిన్నగానే మొదలు పెట్టానని.. ఆర్టిస్టును ప్రేక్షకులు ఆమోదించాలి.. అందుకు కంటెంట్ ఉన్న కథతోనే సాధ్యమవుతుంది. అందుకే.. రౌడీ బాయ్స్ ను ఓకే చేసినట్లు చెబుతున్నారు దిల్ రాజు. ఇన్ని విశేషాలున్న ఈ మూవీ ప్రేక్షకుల మనసుల్ని ఎంతలా ఆకట్టుకుంటుందో చూడాలి.