Begin typing your search above and press return to search.
'9' ని అనుసరిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'...!
By: Tupaki Desk | 6 Oct 2020 1:40 PM ISTసినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువగా నమ్ముతారనే విషయం అందరికి తెలిసిందే. ఇక మన టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టోరీ డిస్కషన్ దగ్గర నుంచి ఫైనల్ స్క్రిప్ట్ లాక్ చేసే వరకు.. నటీనటుల నుండి టెక్నిషియన్స్ ఎంపిక చేసే వరకు.. సినిమాకి కొబ్బరికాయ కొట్టే దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు.. సినిమా ఫస్ట్ లుక్ నుంచి రిలీజ్ చేసే వరకు.. ఇలా ప్రతి దానికి సెంటిమెంట్స్ ని ఫాలో అవుతుంటారు. కొందరు ఫిలిం మేకర్స్ నెంబర్ సెంటిమెంట్ బాగా ఫాలో అవుతారు. ఎవరో రామ్ గోపాల్ వర్మ లాంటి ఒకరిద్దరు తప్ప ఇండస్ట్రీలో అందరికీ నమ్మకాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా 'ఆర్.ఆర్.ఆర్' మేకర్స్ '9' నెంబర్ ని సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా 'రామరాజు ఫర్ భీమ్' వీడియో అక్టోబర్ 22న రాబోతోందని 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ప్రకటించింది. ఈ డేట్ ని కలిపితే '9' వస్తుంది.(22+10+2020 = 9). అందులోనూ ఇప్పుడు రిలీజ్ చేసిన వీడియోలో కనిపిస్తున్న కార్ మరియు బైక్ నంబర్ ప్లేట్స్ కూడా '9' వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. కార్ నెంబర్ - 6+1+7 = 9 గా ఉంటే.. బైక్ నెంబర్ - 1+9+7+1 = 9 అని ఉంది. ఇంతకముందు 'భీమ్ ఫర్ రామరాజు' రిలీజ్ చేసిన డేట్ ని కలిపితే తొమ్మిది వస్తుంది (27+05+2020 = 9). అలానే 'RRR' టైటిల్ తీసుకున్నా ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. ఇంగ్లీష్ లెటర్ 'R' అంటే 18 సంఖ్య వస్తుంది. దీనిని బట్టి 'RRR' 18+18+18 కలిపితే '9' వస్తుంది. ఇదంతా చూస్తుంటే ట్రిపుల్ ఆర్ టీమ్ '9' ని సెంటిమెంట్ గా భావిస్తున్నట్లు అర్థం అవుతోంది.
కాగా, దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం). టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కతున్న ఈ మూవీలో అలియా భట్ - అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ - సముద్రఖని - ఒలివియా మోరిస్ - అలిసన్ డూడీ - రే స్టీవెన్‌సన్ ఇతర ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.