Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : ఒకే ఫ్రేమ్‌ లో 9 మంది కమెడియన్స్

By:  Tupaki Desk   |   15 Nov 2021 10:43 AM GMT
పిక్ టాక్ : ఒకే ఫ్రేమ్‌ లో 9 మంది కమెడియన్స్
X
1980 కాలం నాటి సౌత్‌ స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్స్ గత కొన్నాళ్లుగా రెగ్యులర్‌ గా గెట్ టు గెదర్ ను ఏర్పాటు చేసుకుని సంతోషాన్ని షేర్‌ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వారిని చూసిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా గెట్ టు గెదర్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు అనడంలో సందేమం లేదు. స్టార్‌ హీరోలు మరియు హీరోయిన్స్ దారిలోనే కమెడియన్స్ కూడా అదే ఫాలో అవుతున్నారు. అయితే వీరు ఏడాదికి ఒకసారి కాకుండా నెలకు లేదా రెండు నెలలకు ఒకసారి అలా సదరాగా గడిపేందుకు హైదరాబాద్ లోనే ఏదైనా హోటల్ లేదా ప్రత్యేక ప్రాంతంను ఎంపిక చేసుకుంటూ ఉంటారు. రెగ్యులర్ గా వీళ్లు కలుస్తూనే ఉంటారు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి.

తాజాగా ధన్‌ రాజ్ షేర్ చేసిన ఈ పిక్ లో మొత్తం 9 మంది కమెడియన్స్ ఉన్నారు. వీరిలో కొందరు బుల్లి తెర నుండి వెండి తెర మీదకు వస్తే మరి కొందరు డైరెక్ట్‌ గా వెండి తెర ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారు ఉన్నారు. నెలలో ఎవరికి తోచిన విధంగా వారు కలవడం జరుగుతుంది. ఈ 9 మంది మాత్రమే కాకుండా మరి కొంత మంది కూడా ఉన్నారు కాని వారు ఇతర కార్యక్రమలతో బిజీగా ఉన్నారు. చాలా కాలంగా ఈ కమెడియన్స్ ఇలా కలవడం జరుగుతుంది. వీరిలో కొందరు కమెడియన్స్ కు ఆఫర్లు లేక ఢీలా పడి పోయి ఉండగా మరి కొందరు మంచి ఫామ్‌ లో ఉన్నారు. ఇలా రెగ్యులర్‌ గా కలుస్తూ ఉండటం వల్ల ఆఫర్లు లేని కమెడియన్స్ కు ఏదో ఒక రూపంలో ఆఫర్లు రావడం లేదా కాస్త మనసుకు ప్రశాంతత దక్కడం వంటిది జరుగుతుందని అంటున్నారు.

సీనియర్‌ కమెడియన్స్ ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. అయితే ఈ జనరేషన్ లో మాత్రం స్టార్‌ కమెడియన్‌ అంటే ఎవరు.. టాప్‌ కమెడియన్‌ అంటే ఎవరు అంటే ఠక్కున ఎవరి పేర్లు గుర్తుకు రావు. ఎందుకంటే చాలా మంది కమెడియన్స్ ఇప్పుడు మోస్ట్‌ బిజీ అండ్‌ ట్యాలెంటెడ్‌ వాళ్లు ఉన్నారు. వీళ్లు మాత్రమే కాకుండా జబర్దస్త్‌ కామెడీ చేసే వారు కూడా నవ్విస్తూ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ ఉన్నారు. ఈ కమెడియన్స్ క్లబ్‌ మరింతగా పెరిగి ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించాలని కోరుకుందాం. కొత్త వారికి కూడా ఈ క్లబ్‌ లో స్థానం ఇవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.