Begin typing your search above and press return to search.

777 చార్లీ టీజ‌ర్: ఇంట్రెస్టింగ్.. గ్రిప్పింగ్ డాగ్ స్టోరి

By:  Tupaki Desk   |   6 Jun 2021 8:47 PM IST
777 చార్లీ టీజ‌ర్: ఇంట్రెస్టింగ్.. గ్రిప్పింగ్ డాగ్ స్టోరి
X
ఒక కుక్క దారి త‌ప్పి ఎటో వెళ్లిపోతే.. మార్గ మ‌ధ్యంలో కూడు గూడు నీడ లేక ఎన్నో అవ‌స్థ‌లు ప‌డుతుంటే.. గ‌మ్యం ఏమిటో ప్ర‌యాణం ఎటో తెలీని ప‌రిస్థితిలో ఎండ‌కు ఎండుతూ వాన‌కు త‌డుస్తూ సాగించే జ‌ర్నీలో చివ‌రికి ఆ కుక్క‌ను ఆదుకునేందుకు వ‌చ్చిన ధ‌ర్మ క‌థేమిట‌న్న‌దే `777 చార్లీ` . లైఫ్ ఆఫ్ చార్లీ అంటూ ఆ కుక్క ప్ర‌యాణానికి సంబంధించిన క‌థ‌తో సినిమా ఆద్యంతం తెర‌కెక్కించార‌ని తాజాగా రిలీజైన టీజ‌ర్ చెబుతోంది. విజువ‌ల్స్ ఆద్యంతం ఒక కుక్క ప్ర‌యాణాన్ని ఆవిష్క‌రించారు. చివ‌రిలో ధ‌ర్మ పాత్ర ఆ కుక్క‌కు సంర‌క్ష‌కుడిగా క‌నిపిస్తుంది.

కన్న‌డ న‌టుడు ర‌క్షిత్ శెట్టి ఈ చిత్రంలో ధ‌ర్మ‌ పాత్ర‌ను పోషించారు. ఈ చిత్రానికి అత‌డే నిర్మాత‌. ర‌క్షిత్ పేరు ఇంత‌కుముందు కిరిక్ పార్టీ - శ్రీ‌మ‌న్నారాయ‌ణ లాంటి చిత్రాల‌తో సౌత్ అంత‌టా మార్మోగింది. కిరిక్ పార్టీలో న‌టించేప్పుడే ర‌ష్మిక మంద‌న‌తో ప్రేమ‌లో ప‌డి నిశ్చితార్థం అనంత‌రం బ్రేక‌ప్ స్టోరి తెలిసినదే. ఇక హీరోగా ర‌క్షిత్ క‌న్న‌డ‌లో చాలా స్ట్రాంగ్ పొజిష‌న్ లోనే ఉన్నాడు. నిర్మాత‌గా ప్ర‌యోగాల‌తోనూ ఆక‌ట్టుకుంటున్నాడు. అందుకే ఇప్పుడు 777 అంటూ కొత్త‌గా ట్రై చేస్తుంటే అంద‌రి అటెన్ష‌న్ అటువైపే ఉంది.

నేడు రక్షిత్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఈ చిత్రానికి కిరణ్ రాజ్ ద‌ర్శ‌కుడు. క‌న్న‌డ‌- తెలుగు- తమిళం- హిందీ భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు. ఈ కోవిడ్ స‌మ‌యంలో ఎక్కువ పాత్ర‌ల‌తో ప‌ని లేకుండా తెలివైన స్క్రిప్టును ర‌క్షిత్ ఎంచుకున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. నిర్మాత‌గానూ అత‌డు సేఫ్ గేమ్ నే అనుస‌రించాడ‌ని క్లారిటీగానే క‌నిపిస్తోంది. మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో అభిమానుల ముందుకు వ‌స్తున్నాడు. అయితే హాలీవుడ్ లో ఈ త‌ర‌హా సినిమాలు కోకొల్ల‌లు. ఏ డాగ్ జ‌ర్నీ.. ఏ డాగ్స్ ప‌ర్ప‌స్ .. ఏ డాగ్స్ హోమ్ ఇవ‌న్నీ డాగ్ జ‌ర్నీ నేప‌థ్యంలోనివే. కుక్క ప్ర‌యాణానికి సంబంధించి చార్లీ త‌రహాలోనే ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. వీట‌న్నిటికంటే డిఫ‌రెంట్ గా ఈ మూవీలో ఏం చూపించార‌న్న‌ది చూడాలి.