Begin typing your search above and press return to search.

సీకే బ్యూటీ స్పెష‌ల్ ట్రీట్ కి గెట్ రెడీ

By:  Tupaki Desk   |   3 Feb 2020 4:21 AM GMT
సీకే బ్యూటీ స్పెష‌ల్ ట్రీట్ కి గెట్ రెడీ
X
ఆషిఖి 2 కాంబో రిపీట‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆదిత్య‌రాయ్ క‌పూర్- మోహిత్ సూరి బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న తాజా చిత్రం `మ‌ళంగ్`. దిశా ప‌టానీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అనిల్ కపూర్- కునాల్‌ ఖేము ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్ప‌టికే న‌టీనటుల పోస్ట‌ర్లు స‌హా ట్రైల‌ర్ అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. సీకే బ్యూటీ దిశా ప‌టానీ అన్ లిమిటెడ్ గ్లామ‌ర్ ట్రీట్ అభిమానుల్ని స్పెల్ బౌండ్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో నీటి అడుగున నాయ‌కానాయిక‌ల‌ సుదీర్ఘ చుంబ‌నం ప్ర‌స్తుతం హాట్ టాపిక్. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ క‌పూర్ 6ప్యాక్ లుక్ తో అద‌ర‌గొడుతున్నాడు.

క్రైమ్.. భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యం లో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే చిత్ర‌మిద‌ని టీమ్ చెబుతోంది. రెగ్యుల‌ర్ ల‌వ‌ర్ బోయ్ త‌ర‌హా పాత్రల్లో న‌టించిన ఆదిత్య రాయ్ క‌పూర్ ఈసారి సీరియ‌ల్‌ కిల్లర్‌ గా ప్ర‌యోగం చేస్తుంటే.. అతన్ని వెంటాడే పోలీసాఫీసర్‌ పాత్రలో అనిల్‌ కపూర్‌ కనిపిస్తున్నారు. త్వ‌ర‌లో సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్న సంద‌ర్భంగా చిత్ర‌బృందం ఇప్ప‌టికే ప్ర‌చారంలో వేగం పెంచింది.

ఫిబ్ర‌వ‌రి 7న మ‌ళంగ్ థియేట‌ర్ల‌లోకి రిలీజ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా స్పెషల్ ట్రీట్ ఉంటుంద‌ని చిత్ర‌ క‌థానాయిక దిశా ప‌టానీ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. ఈ సినిమా నుంచి హూయీ మ‌ళంగ్ అంటూ సాగే పాట‌ను నేటి సాయంత్రం రిలీజ్ చేస్తున్నారు. స్పెష‌ల్ నంబ‌ర్లు.. రొమాంటిక్ సాంగ్స్ లో అందాల ఆర‌బోత‌కు ఏమాత్రం అడ్డు చెప్ప‌ని దిశాకు ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధార‌ణంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే మ‌ళంగ్ చిత్రానికి క్రేజు ఏర్ప‌డింది.