Begin typing your search above and press return to search.

నిర్మాతకు 7 కోట్ల న‌ష్టం.. పాయ‌ల్ కార‌ణమా?

By:  Tupaki Desk   |   8 Dec 2020 9:00 PM IST
నిర్మాతకు 7 కోట్ల న‌ష్టం.. పాయ‌ల్ కార‌ణమా?
X
టాలీవుడ్ అగ్ర హీరోల‌తో సినిమాలు నిర్మించారు సి.క‌ళ్యాణ్. న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో హిట్ చిత్రాల్ని నిర్మించారు. మునుముందు అగ్ర హీరోల కాల్షీట్ల కోసం వేచి చూస్తూ ప్ర‌స్తుతానికి ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాల్ని నిర్మిస్తున్నారు. అలాగే నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగానూ ఆయ‌న సుప‌రిచితం. అయితే అంత పెద్ద నిర్మాత త‌న క‌థానాయిక మాయ చేయ‌డంతో న‌ష్ట‌పోయార‌ట‌. ఇంత‌కీ ఏ సినిమా విష‌యంలో? ఎవ‌రా క‌థానాయిక‌? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఇంత‌కుముందు ఆర్.ఎక్స్ 100 ఫేం పాయ‌ల్ రాజ్ పుత్ న‌టించిన ఆర్.డి.ఎక్స్ గురించే ఈ చ‌ర్చంతా. ఈ మూవీని సి.క‌ళ్యాణ్ నిర్మించారు. పాయ‌ల్ నాయికా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించ‌గా.. ఓ యువ‌హీరో ల‌వ‌ర్ బోయ్ గా రొమాంటిక్ పాత్ర‌లో న‌టించారు.

అప్ప‌ట్లో ఈ మూవీ ట్రైల‌ర్ చూసి పాయ‌ల్ మ‌రీ డీగ్రేడ్ పాత్ర‌లో న‌టిస్తోందంటూ అభిమానులు దుమ్మెత్తిపోశారు. అప్పుడే ఇలా దిగ‌జార‌డం స‌రికాద‌ని విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత సినిమా రిలీజై డిజాస్ట‌రైంది. అయితే తాను చేసిన త‌ప్పిదం వ‌ల్ల‌నే త‌న‌కు 7కోట్లు న‌ష్టం వ‌చ్చింద‌ని తాజా ఇంట‌ర్వ్యూలో సి.క‌ళ్యాణ్ అంగీక‌రించారు.

నిజానికి మంచి డెప్త్ ఉన్న క‌థ‌ను ఎంపిక చేసుకుని భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్ట‌డం కోసం ట్రైల‌ర్ ని శృంగార‌భ‌రితంగా చూపించాల‌ని సినిమాలో సీన్ల‌న్నిటినీ ఓ చోట చేర్చార‌ట‌. దాంతో ఆ ట్రైల‌ర్ పై మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. పాయ‌ల్ ని మ‌రీ టూమ‌చ్ గా చూపించార‌ని విమ‌ర్శించారు. సోష‌ల్ మీడియాల్లోనూ ఇదే వైర‌ల్ అయ్యింది.

దీంతో పాయ‌ల్ త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చి మొర‌పెట్టుకుంద‌ట‌. ``ఈ ట్రైలర్ కారణంగా తన ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోంది` అంటూ పాయ‌ల్ వాపోవ‌డంతో ఆమె మాట‌ల్ని గౌర‌విస్తూ .. మ‌రో కొత్త ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు. ఇందులో లేడీ అమితాబ్ విజయశాంతి తరహాలో పాయల్ రాజ్ పుత్ ఫైట్స్ చేస్తూ క‌నిపిస్తుంది. అయితే దీనిపైనా కుర్రాళ్లు పెద‌వి విరిచేశారు. మ‌రీ విజ‌య‌శాంతిలా చూపిస్తారా? అంటూ అలా కూడా నెగెటివ్ అయ్యింద‌ట‌. దీంతో థియేట‌ర్ల‌కు ఎవ‌రూ రాలేదు. అలా ఓపెనింగ్స్ క‌రువై 7 కోట్ల నష్టం వాటిల్లింద‌ట‌. తాను చేసిన చిన్న తప్పువల్ల నిర్మాతగా కోట్లు నష్టపోయానని సి. కళ్యాణ్ తెలిపారు. మొత్తానికి త‌ప్పేంటో గ్ర‌హించి అంగీక‌రించిన నిర్మాత‌ను ప్ర‌శంసించి తీరాలి. అలాగే ఆర్.డి.ఎక్స్ లాంటి బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా ఎంపిక త‌న తప్పేన‌‌ని పాయ‌ల్ అంగీక‌రిస్తుందేమో చూడాలి.