Begin typing your search above and press return to search.

ఇవే నంది అవార్డులనుకుందాం..

By:  Tupaki Desk   |   27 Jun 2015 9:00 PM IST
ఇవే నంది అవార్డులనుకుందాం..
X
గతంలో నంది అవార్డులే మన టాలీవుడ్‌ నటీనటులకు, టెక్నీషియన్స్‌కు తలమానికం. వాటి గురించే గొప్పగా చెప్పుకునేవాళ్లు. ఫిలిం ఫేర్‌ అవార్డుల గురించి ఆ స్థాయిలో చెప్పుకునేవాళ్లు కాదు. కానీ తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడంతో నంది అవార్డుల కథ ఏటూ తేలకుండా పోయింది. అసలీ అవార్డుల్ని ఏ రాష్ట్రం ఇస్తుంది? ఇద్దరూ ఇస్తే ఏ అవార్డును ప్రతిష్టాత్మకంగా భావించాలి? అని సినిమా వాళ్లు కొన్నాళ్ల పాటు బుర్రలు బద్దలు కొట్టుకున్నారు కానీ.. రెండు రాష్ట్రాలూ ఆ అవార్డుల సంగతి పట్టించుకోకపోవడంతో ఎవ్వరూ ఆ ఊసే ఎత్తట్లేదు. ఎలాగూ నంది అవార్డులు అటకెక్కేశాయి కాబట్టి.. ఫిలింఫేర్‌ అవార్డుల్నే నంది అవార్డుల్లా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు టాలీవుడ్‌ జనాలు. ఫిలిం ఫేర్‌లో అన్ని విభాగాలకూ అవార్డులుండవు కానీ.. ఉన్నవాటితో సర్దుకుపోక తప్పదు.

ఇక అత్యంత ఆసక్తి రేపిన 62వ ఫిలిం ఫేర్‌ అవార్డుల విషయానికొస్తే.. ఉత్తమ చిత్రంగా 'మనం' ఎంపికైంది. విక్రమ్‌కుమార్‌ (మనం) ఉత్తమ దర్శకుడిగా, అల్లు అర్జున్‌ (రేసుగుర్రం) ఉత్తమ నటుడిగా, శ్రుతి హాసన్‌ (రేసుగుర్రం) ఉత్తమ నటిగా ఎంపికయ్యారచు. ఉత్తమ సహాయ నటుడిగా జగపతి బాబు (లెజెండ్‌), ఉత్తమ సహాయ నటిగా మంచు లక్ష్మి (చందమామ కథలు), ఉత్తమ సంగీత దర్శకుడిగా అనూప్‌ రూబెన్స్‌ (మనం), ఉత్తమ గేయ రచయితగా చంద్రబోస్‌ (కనిపించిన మా అమ్మకి.. మనం), ఉత్తమ గాయకుడిగా సింహా (సినిమా చూపిస్త మావా.. రేసుగుర్రం), ఉత్తమ గాయనిగా సునీత (ఏం సందేహం లేదు.. ఊహలుగుసగుసలాడే) ఎంపికయ్యారు. మొత్తం పది అవార్డుల్లో మనం, రేసుగుర్రం సినిమాలకే ఏడు అవార్డులు రావడం విశేషం.