Begin typing your search above and press return to search.

`ఆదిపురుష్ 3డి` 60రోజుల షెడ్యూల్ కి ప్లాన్ రెడీ

By:  Tupaki Desk   |   11 Sept 2020 9:45 AM IST
`ఆదిపురుష్ 3డి` 60రోజుల షెడ్యూల్ కి ప్లాన్ రెడీ
X
ప్ర‌భాస్ త‌న పంథా మార్చుకున్నారు. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ని అంగీక‌రిస్తూ మిగ‌తా స్టార్‌ హీరోల‌కు వ‌రుస షాకులిస్తున్నారు. ప్ర‌స్తుతం `రాధేశ్యామ్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ మూవీ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే `మ‌హాన‌టి` ఫేమ్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్ మూవీకి అంగీక‌రించారు. వైజ‌యంతీ మూవీస్ 50 ఏళ్ల ప్ర‌స్థానంలో క‌ల‌కితురాయిగా ఈ చిత్రం నిల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో అశ్వ‌నీద‌త్ ఈ మూవీని పాన్ ఇండియా(వ‌ర‌ల్డ్) కేట‌గిరీలో ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఏకంగా 400కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ఈ మూవీ సెట్స్ ‌పైకి రాకుండానే ప్ర‌భాస్ `ఆదిపురుష్ 3డి‌` చిత్రాన్ని అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ డైరెక్ష‌న్ లో టీ సిరీస్ సంస్థ నిర్మించ‌బోతోంది. రామ‌య‌ణ గాధ స్ఫూర్తితో మెలూహా త‌ర‌హా పాత్ర చిత్ర‌ణ‌తో రూపొంద‌నున్న ఈ మూవీని తెలుగు- త‌మిళ- మ‌ల‌యాళ- క‌న్న‌డ- హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రావ‌ణా సురుడిగా సైఫ్ అలీఖాన్ న‌టించ‌బోతున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కంటే ముందే జ‌న‌వ‌రిలో ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది.

దీని కోసం ప్ర‌భాస్ 60 వ‌ర్కింగ్ డేస్ ‌ని కేటాయిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే షూట్ కి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ‌ని చిత్ర బృందం ఇప్ప‌టికే ప్రారంభించింద‌ని.. న‌టీన‌టులు.. సాంకేతిక నిపుణుల్ని త్వ‌ర‌లోనే ఫైన‌ల్ చేసి షూట్ కి రెడీ చేయాల‌ని ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ప్ర‌భాస్ ఆర్చ‌రీ విద్య‌లోనూ ఆరితేరుతున్నార‌ని తెలుస్తోంది. మొత్తానికి ముందే ఊహించిన‌ట్టే నాగ్ అశ్విన్ కంటే ముందే ఓం రౌత్ య‌మ స్పీడ్ గా ఉన్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.