Begin typing your search above and press return to search.
లేట్ ఏజ్ లో 60 కోట్ల హీరోగా నిలిచాడు..!
By: Tupaki Desk | 18 Feb 2021 8:00 AM ISTమాస్ మహారాజ్ రవితేజ - శృతిహాసన్ జంటగా నటించిన 'క్రాక్' సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మించాడు. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని - వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ప్రధాన పాత్రధారుల పెర్ఫార్మన్స్ తో పాటు థమన్ అందించిన మ్యూజిక్.. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమా విజయంలో కీ రోల్ ప్లే చేశాయి.
జనవరి నెల సినిమాల బాక్సాఫీస్ రన్ చూసుకుంటే.. 'క్రాక్' సినిమా నిర్మాతలకు దాదాపుగా 22 కోట్లు లాభం వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు వరుస ప్లాప్స్ తర్వాత రవితేజ నుంచి వచ్చిన ఈ చిత్రం ఆయన్ని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించడమే కాకుండా.. 60 కోట్లు గ్రాస్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కోవిడ్ నేపథ్యంలో 50 శాతం థియేటర్ సీటింగ్ ఆక్యుపెన్సీతో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి. అంతేకాక సంక్రాంతి బరిలో దిగిన 'మాస్టర్' 'రెడ్' 'అల్లుడు అదుర్స్' సినిమాలను తట్టుకుని 'క్రాక్' రికార్డ్ స్థాయిలో వసూళ్ళు రాబట్టింది. మాస్ మహారాజా రవితేజను 60 కోట్ల హీరోగా నిలిపింది.