Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ ఓవరాల్ బిజినెస్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   2 Jun 2023 7:03 PM GMT
ఆదిపురుష్ ఓవరాల్ బిజినెస్ ఎంతంటే?
X
డార్లింగ్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కి జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రాబోతోన్న పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా కనిపించబోతూ ఉండగా సైఫ్ ఆలీఖాన్ లంకేష్ రావణ్ పాత్రలో దర్శనం ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. దీంతో బిజినెస్ కూడా మూవీపై గట్టిగానే జరిగిందని తెలుస్తోంది.

ఓవరాల్ గా ఐదు భాషలలో ఈ సినిమాపై ఏకంగా 550 కోట్ల బిజినెస్ జరిగిందంట. ఓ విధంగా చెప్పాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద బిజినెస్. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రూపంలో 250 కోట్ల రూపాయిలు ఇప్పటికే నిర్మాతకి వచ్చేశారు.

ఇక తెలుగులో 185 కోట్లకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రైట్స్ ని సొంతం చేసుకుంది. హిందీ, ఓవర్సీస్ తో పాటు ఇతర భాషలలో టి-సిరీస్ నుంచి భూషణ్ కుమార్ సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు.

ఇక ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ కూడా టి-సిరీస్ ఉంచుకుంది. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో లోకల్ డిస్టిబ్యూటర్స్ కి ఫ్యాన్సీ రేటుకి ఏరియా వైజ్ గా రైట్స్ ని తీసుకున్నారు. ఇలా మొత్తం లెక్కల ప్రకారం చూసుకుంటే 550 కోట్ల బిజినెస్ ఆదిపురుష్ పై జరిగిందంట. ఈ మూవీ కోసం సుమారు 350 కోట్ల బడ్జెట్ భూషణ్ కుమార్ పెట్టారు.

అయితే డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారానే 75 శాతం బడ్జెట్ రికవరీ అయ్యింది. దీంతో వారం రోజుల పాటు మంచి టాక్ తెచ్చుకొని థియేటర్స్ లో కరెక్ట్ గా ఆడితే నిర్మాతకి టేబుల్ ప్రాఫిట్ రావడం ఖాయం అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి భారీ బ్రేక్ ఎవెన్ టార్గెట్ తోనే థియేటర్స్ లోకి రాబోతోన్న ఈ మూవీ ప్రేక్షకులని ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తోందనేది వేచి చూడాలి.

ఇక జూన్ 6 నుంచి తిరుపతిలో ప్రీరిలీజ్ ఈవెంట్ తో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు.దేశ వ్యాప్తంగా సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగా గట్టిగానే ప్రమోషన్ యాక్టివిటీస్ ప్లాన్ చేసారంట. అలాగే ప్రీరిలీజ్ రోజున సెకండ్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.