Begin typing your search above and press return to search.

200 సెకన్లలో సూపర్‌ స్టార్‌ లైఫ్

By:  Tupaki Desk   |   23 March 2016 8:36 AM GMT
200 సెకన్లలో సూపర్‌ స్టార్‌ లైఫ్
X
షారూక్ ఖాన్ ప్రస్తుతం తను నటించిన ఫ్యాన్ మూవీకి ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నాడు. ఈ మూవీలో ఫ్యాన్ గౌరవ్ గాను - సూపర్ స్టార్ ఆర్యన్ ఖన్నాగాను తనే డ్యుయల్ రోల్ చేస్తున్నాడు షారూక్. ఈ మూవీ విడుదలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండడంతో.. ప్రమోషన్స్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా. ఈ సమయంలో షారుక్ కి ఓ సూపర్ గిఫ్ట్ అందింది.

ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకూ తన జీవితంలో అందుకున్న వాటిలో ఇదే అత్యద్భుతమైన బహమతి అనాలి. ఇప్పుడున్న కళల్లో శాండ్ ఆర్ట్ చాలా క్లిష్టమైనది. కానీ రాహుల్ ఆర్య అనే ఓ షారుక్ వీరాభిమాని.. తన అభిమాన హీరోపై ఓ శాండ్ ఆర్ట్ తో ఓ రూపకం లాంటిది తయారు చేశాడు. ఇందులో షారుక్ చిన్న నాటి నుంచి కుబేరుడిగా మారే వరకు, నెగిటివ్ పాత్ర నుంచి బాద్ షా స్థాయిని అందుకునే వరకు. లవర్ బాయ్ నుంచి తండ్రిగా మారేవరకూ.. అన్నింటినీ ఇందులో పొందుపరిచాడు.

ఇన్ని ఘట్టాలు ఉన్నాయి కదా.. ఎంత లెంగ్త్ ఉంటుందో అనుకోకండి. కేవలం 200 సెకన్లలోనే 50ఏళ్ల షారూక్ లైఫ్ లోని ప్రధాన ఘట్టాలన్నీ ఆవిష్కరించాడు రాహుల్ ఆర్య. దీన్ని నిలబడి మరీ చూసిన షారూక్.. అలాగే బిగుసుకుపోయాడు చాలాసేపు. అంతగా నచ్చింది ఆ స్టార్ కి.