Begin typing your search above and press return to search.

40వేల ఖ‌రీదు టీష‌ర్ట్ ని ఇదేమి చెత్త అనేశారు!

By:  Tupaki Desk   |   9 Jun 2022 5:30 PM GMT
40వేల ఖ‌రీదు టీష‌ర్ట్ ని ఇదేమి చెత్త అనేశారు!
X
సెల‌బ్రిటీల స్టైలింగ్.. ఫ్యాష‌న్ అనుక‌ర‌ణ‌ను అభిమానులు నిశితంగా ప‌రిశీలిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. త‌మ ఫేవ‌రెట్ స్టార్లు ధ‌రించే డిజైన‌ర్ దుస్తుల‌తో పాటు యాక్సెస‌రీస్ స్లిప్ప‌ర్స్ వ‌గైరా వ‌గైరా ఎలా ఉన్నాయో ప‌రిశీల‌న‌గా చూస్తారు. త‌మ‌కు న‌చ్చేవాటిని ఎంత ఖ‌రీదుకు అయినా కొనేస్తుంటారు కొంద‌రు ఫ్యాన్స్. కానీ న‌చ్చ‌క‌పోతే మాత్రం సోష‌ల్ మీడియాల్లో అంతే చెత్త‌గా తిట్టేస్తుంటారు. ఇప్పుడు బెబో క‌రీనా క‌పూర్ ఖాన్ కి ఇలాంటి చేదు అనుభ‌వం ఎదురైంది.

బాలీవుడ్ లో ఎదురేలేని ఫ్యాష‌నిస్టాగా వెలిగిపోతున్న బెబో ఏ డ్రెస్ ధ‌రించినా ఫ్యాన్స్ దానిపై కామెంట్ చేస్తారు. తాజాగా కరీనా కపూర్ ఖాన్ రూ. 40000 ఖ‌రీదు చేసే ప్ర‌ఖ్యాత‌ గూచీ బ్రాండ్ టీ ష‌ర్ట్ ని ధ‌రించింది. కానీ ఈ ప‌సుపు రంగు గూచీ తీవ్ర‌మైన ట్రోలింగుకి గురైంది. కరీనాకు స‌ద‌రు బ్రాండ్ పై ఉన్న ప్రేమ అంతా ఇంతా కాదు. చాలా సందర్భాలలో ఇది కనిపించింది. నిరంత‌రం ప‌బ్లిక్ లో స్టన్నర్ లుక్ తో క‌నిపించేందుకు విలాసవంతమైన గూచీ బ్రాండ్ ని వినియోగిస్తుంటుంది. హూడీలు.. స్వెట్ ష‌ర్ట్స్.. టీ-షర్టులు బ్యాగులు ఏవైనా గూచీ బ్రాండ్ వి ధరించి కనిపిస్తుంది బెబో.

రూ. 40 వేలు ఖ‌రీదు చేసే గూచీ టీష‌ర్ట్ ధరించినందుకు కరీనా కపూర్ ఖాన్ దారుణంగా ట్రోలింగ్ కి గురైంది. ఇదేమి చెత్త టీష‌ర్ట్ ఏడ్చిన‌ట్టుంది! అంటూ ఒక అభిమాని దీనిపై కామెంట్ చేసాడు. కరీనా కపూర్ ఖాన్ ఇటీవల తన బాంద్రా నివాసం వెలుపల లైమ్ గ్రీన్ గూచీ టీస్ - డెనిమ్ లోయర్స్ ధ‌రించి కనిపించింది. ఇంట్లో క్యాజువ‌ల్ లుక్ ఇది. కానీ ఇంత‌లోనే ఈ వీడియో సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ అయ్యింది. దానిపై ట్రోల‌ర్స్ చెల‌రేగారు. కరీనా కపూర్ కే తెలియ‌ని రీతిలో విపరీతంగా ట్రోలింగ్ ఎదురైంది. ఇది ఖరీదైన రూ. 40000 గూచీ టీష‌ర్టులా కనిపించడం లేదని ..దీనిని జనపథ్ లేదా సరోజినీ మార్కెట్ లలో రూ. 150 ధ‌ర‌కే సులువుగా కొనేస్తామ‌ని కూడా వ్యాఖ్యానించారు.

ఆన్ లైన్ లో సెలబ్రిటీలు ట్రోలింగుకి గురి కావడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ప్రియాంక చోప్రా- మలైకా అరోరా స‌హా చాలా మంది ఎ-లిస్టర్ సెల‌బ్స్ త‌మ‌ దుస్తుల విష‌యంలో ట్రోలింగుకి గుర‌య్యారు. ఇప్పుడు క‌రీనా టైమ్ వ‌చ్చింది.

లాల్ సింగ్ చద్దాలో కరీనా

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దాలో బెబో క‌రీనా క‌థానాయిక‌గా కనిపించనుంది. ఈ చిత్రం 1994 అమెరికన్ చిత్రం ఫారెస్ట్ గంప్ కి అధికారిక రీమేక్. ఇది అదే పేరుతో విన్ స్టన్ గ్రూమ్ 1986 నవల ఆధారంగా తెర‌కెక్కింది. వయాకామ్ 18 స్టూడియోస్ - అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన లాల్ సింగ్ చద్దా చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ప్రీతమ్ సంగీతం అందించారు. అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. ఈ చిత్రాన్ని అతుల్ కులకర్ణి స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు.

అలాగే సుజోయ్ ఘోష్ తెర‌కెక్కిస్తున్న `డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్`లో క‌రీనా న‌టిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో జరుగుతోంది. ఇందులో విజయ్ వర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు.