Begin typing your search above and press return to search.

నాని ప్రయోగం కోసం నలుగురు ముద్దుగుమ్మలు

By:  Tupaki Desk   |   18 Jun 2021 6:50 AM GMT
నాని ప్రయోగం కోసం నలుగురు ముద్దుగుమ్మలు
X
నాని హీరోగా వరుసగా చిత్రాలు చేస్తూనే మరో వైపు తన బ్యానర్ లో సినిమా లను కూడా నిర్మిస్తూ ఉన్నాడు. కమర్షియల్‌ సినిమా లు కాకుండా మంచి కంటెంట్‌ ఓరియంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ అభిరుచి కలిగిన నిర్మాతగా పేరు దక్కించుకున్నాడు. నాని వాల్‌ పోస్టర్ సినిమా బ్యానర్‌ లో మొదటగా 'అ!' సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత హిట్‌ సినిమా ను కూడా నిర్మించిన నాని సక్సెస్ దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం తన సోదరి దర్శకత్వంలో 'మీట్ క్యూట్‌' అనే ప్రయోగాత్మక సినిమాను నిర్మిస్తున్నాడు.

మీట్‌ క్యూట్‌ సినిమా ను ఇటీవలే పట్టాలెక్కించారు. సత్యరాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లో ఏకంగా నలుగురు ముద్దుగుమ్మలు కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. నలుగురు హీరోయిన్స్ లో ఇద్దరు నోటెడ్‌ హీరోయిన్స్ ను తీసుకుని ఇద్దరిని కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందంటున్నారు. ఇటీవలే నాని టీమ్ కాజల్ అగర్వాల్‌ ను ఈ సినిమా కు గాను సంప్రదించారట. పాత్ర మరియు కథ నచ్చడంతో వెంటనే ఆమె నటించేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.

కాజల్‌ తో పాటు ఈ సినిమా లో మరో కీలక పాత్రలో నివేదా థామస్ ను కూడా ఎంపిక చేసే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో ఇద్దరు ఎవరు హీరోయిన్స్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చారని.. త్వరలోనే నలుగురు ముద్దుగుమ్మల పేర్లను ప్రకటించడంతో పాటు వారితో షూటింగ్‌ ను మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు. ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందుతున్న ఈ సినిమా కమర్షియల్‌ గా కాకుండా నాని బ్యానర్‌ కు మంచి పేరు తెచ్చి పెడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.