Begin typing your search above and press return to search.

నేను నటుడుని.. హీరోని కాను..

By:  Tupaki Desk   |   20 July 2017 8:27 AM GMT
నేను నటుడుని.. హీరోని కాను..
X
సినిమా అంటే ఏంటో చాలమందికి చాలావరకు ఒక ఊహ వచ్చిన తరువాత అర్ధం అవుతుంది. కొంతమందికి సినిమా సామ్రాజ్యంలోనే పుట్టి పెరుగుతారు. అలాంటి వారి కోవలోకే వస్తాడు మన తెలుగు యంగ్ హీరో రానా. రాజకీయం తెలియని ఒక కుర్రవాడు ప్రజల మంచి కోరే ముఖ్యమంత్రి గా నటించినా.. వీది నాటకాలు వేసుకునే తాతకు మనవడుగా చేసినా.. అధికార దాహంతో ఎంతటి క్రూరమైన పనికైనా సిద్దపడే భళ్లాలదేవగా నటించినా.. నేవీ అధికారిగా నటించిన పాత్రలో పూర్తిగా ఒదిగి తనను తాను పూర్తిగా దర్శకుడుకి అర్పించిన నటుడు రానా. ఇప్పుడు మళ్ళీ తన నటనతో అందరిని అలరించడానికి జోగేంద్ర గా ఒక యువ రాజకీయ నాయకుడు గా వస్తున్నాడు.

రానా తన కొత్త సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ పై గట్టి నమ్మకంగానే ఉన్నాడు. తన సినిమా ప్రచారంకోసం కూడా కొత్త టెక్నాలజీ ఆగ్మెంటెడ్ రియాల్టీ AR ని వాడి ప్రచారం చేస్తున్నాడు. సినిమా హాల్లో ఉన్న 3డి పోస్టర్ దగ్గర AR అప్ ద్వారా నటులుతో ఫోటో తీసుకొనే ఆప్షన్ ఉంది. అప్పట్లో నరేంద్ర మోడి కూడా ప్రచారం చేసింది ఈ టెక్నాలజీ సాయంతోనే. ఈ ప్రచారం కొత్తగా ఉంది ఇది ఒక మంచి ప్రయోగం అని చెబుతున్నాడు రానా. “నాకు ఈ సినిమాపై చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది ఒక హీరో చుట్టూ తిరిగే కథ కాదు. ఒక కథలో కొందరి మనుషుల ప్రయాణం. ఈ మధ్య కాలంలో మనం ఇటువంటి సినిమాలు చూడలేదు అని చెప్పగలను. తేజ గారు డైరక్షన్లో పని చేయడం వలన నేను చాలా నేర్చుకున్నాను. తేజకు అన్నీ క్రాఫ్ట్ లు పై మంచి అవగాహన ఉంది. మా నాన్న నేను అడిగిన ప్రతి ప్రశ్నకు అతని దగ్గర సమాధానం ఉండేది. అదే ఈ సినిమాను నిర్మించడానికి ప్రేరణ అయ్యింది. నేనే రాజు నేనే మంత్రి లో నేను జోగేంద్ర గా దుష్ట రాజకీయ నాయకుడుగా నటించాను. ఒక రైతుగా ఉన్న జోగేంద్ర కొంతమంది అధికారుల దుర్మార్గమైన పనులుకు తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో మీరు తెర పై చూడవచ్చు. నేను ఒక రెగ్యులర్ హీరోలా ఉండాలి అనుకోవడంలేదు. నాకు కొత్త కొత్త కథలు కావాలి నా నటన శక్తికి పరీక్ష పెట్టె పాత్రలు కావాలి'' అని చాల ఉత్సాహంగా చెబుతున్నాడు.

రానా ఈ సినిమా తరువాత సత్య శివ డైరక్షన్లో ‘మాడై తీరంతూ’ అనే తమిళ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను తెలుగు తమిళ్ రెండు బాషలులోను నిర్మిస్తున్నారు. సుభాష్ చంద్ర బోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించినప్పుడు ఆ దళంలో ఒక వీరుడు కథే ఈ ‘మాడై తీరంతూ’ అని చెబుతున్నారు. ఇప్పుడు అయితే నేనే రాజు నేనే మంత్రి 3డి పోస్టర్ సినిమా హాల్ వద్ద మనం చూడవచ్చు. అప్ స్టార్ అనే అప్ ద్వారా రానా కాజల్ మీ ముందే ఉండేలా ఈ అప్ ని డిజైన్ చేశారు. మొత్తానికి సినిమాని ఎన్ని వాధాలుగా ప్రచారం చేసి జనాలుకు చేరువ కాగలమో అన్నీ దారులను వెతుకుతున్నాడు రానా.​