Begin typing your search above and press return to search.

#RRR శాటిలైట్ డిజిట‌ల్ హ‌క్కుల‌కు 325 కోట్ల డీల్!?

By:  Tupaki Desk   |   22 May 2021 1:30 AM GMT
#RRR శాటిలైట్ డిజిట‌ల్ హ‌క్కుల‌కు 325 కోట్ల డీల్!?
X
పాపుల‌ర్ బాలీవుడ్ నిర్మాత.. పెన్ ఇండియా అధినేత (పెన్) జయంతిలాల్ గడా ఆర్.ఆర్.ఆర్ నిర్మాత‌ల‌తో 475 కోట్ల మేర‌ డీల్ ని కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఆర్.ఆర్.ఆర్ కి సంబంధించిన‌ అన్ని భాషలకు శాటిలైట్ - డిజిట‌ల్ కి సంబంధించిన‌ అన్ని హక్కులను ఆయ‌న పొందారు. ఇప్పుడు ఆయ‌న నుంచి జీగ్రూప్ శాటిలైట్ డిజిటల్ హక్కుల కోసం సుమారు 325 కోట్లు చెల్లించి చేజిక్కించుకుంది. ఇది ఇప్పటివరకు ఈ కేట‌గిరీలో అతిపెద్ద డీల్. అయితే ఇది డైరెక్ట‌ర్ రిలీజ్ అవ‌కాశం కాదు. థియేట్రిక‌ల్ రిలీజ్ పూర్త‌యిన అనంత‌రం స్ట్రీమింగ్ కోసం చేసుకున్న ఒప్పందం.

ప్ర‌స్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ ల మధ్య గట్టి పోటీ ఉంది. ఆ క్ర‌మంలోనే జీ గ్రూప్ సాహ‌సం వేడెక్కిస్తోంది. స్టార్ నెట్ వ‌ర్క్ -డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి ఇది మింగుడుప‌డ‌నిదిగా భావిస్తున్నారు. జయంతిలాల్ శాటిలైట్- డిజిటల్ సెట్ ను అన్ని భాష‌లు క‌లిపి జీ గ్రూప్ కు విక్రయించారు. పెన్ ఇప్పుడు థియేటర్లలో RRR హిందీ వెర్షన్ ను మాత్రమే పంపిణీ చేస్తారు. ఇంకా హిందీ థియేట్రికల్ హక్కులు పెన్ సంస్థ వ‌ద్ద‌నే ఉన్నాయి.

ప్ర‌స్తుత క్రైసిస్ నేప‌థ్యంలో ఆర్.ఆర్.ఆర్ ద‌స‌రా కానుక‌గా రిలీజ‌వుతుందా లేదా? అన్న‌ది సందిగ్ధ‌మే. ద‌స‌రా కుద‌ర‌క‌పోతే సంక్రాంతి 2022కి రిలీజ‌య్యేందుకు ఆస్కారం ఉంద‌ని భావిస్తున్నారు. బాహుబ‌లి దర్శ‌కుడు రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ పై హిందీ బెల్ట్ లోనూ ఎంతో ఉత్కంఠ నెల‌కొంది.