Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్‌ తో క్లాస్‌ రూమ్ లో 30 వెడ్స్‌ 21 హీరోయిన్‌!!

By:  Tupaki Desk   |   15 Jun 2021 1:30 PM GMT
అల్లు అర్జున్‌ తో క్లాస్‌ రూమ్ లో 30 వెడ్స్‌ 21 హీరోయిన్‌!!
X
గత కొన్ని వారాలుగా తెలుగు రాష్ట్రాల నెటిజన్స్‌ అనన్య పేరుతో ఊగిపోతున్నారు. ఈమె నటించిన 30 వెడ్స్ 21 యూట్యూబ్‌ సిరీస్ సెన్షేషనల్‌ సక్సెస్ అయ్యింది. అద్బుతమైన బ్యాక్‌ డ్రాప్ మ్యూజిక్ కు యూత్‌ ఆడిన్స్ కు కనెక్ట్ అయ్యే లవ్‌ కమ్‌ రొమాంటిక్ సన్నివేశాలు యాడ్‌ అవ్వడంతో 30 వెడ్స్ 21 ను ప్రేక్షకులు విపరీతంగా ఆధరించారు. స్వయంగా టాలీవుడ్ జక్కన్న ఈ యూట్యూబ్ సిరీస్ కు కితాబిచ్చాడు. దాంతో ఈ సిరీస్ తో పాటు అందులో నటించిన వారు కూడా ఫుల్‌ ఫేమస్ అయ్యారు. 21 ఏళ్ల భార్యగా నటించిన అనన్య ప్రస్తుతం సోషల్‌ మీడియా సెన్షేషన్‌. తాజాగా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఆ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ అంటే తనకు విపరీతమైన అభిమానం అంటూ చెప్పుకొచ్చింది. ఎంత అభిమానం అంటే ఆయన తన కలలోకి కూడా వస్తాడని చెప్పింది. ఒకసారి అల్లు అర్జున్‌ మరియు నేను ఒకే క్లాస్ రూమ్‌ లో ఉన్నట్లుగా కల వచ్చింది. క్లాస్ రూమ్‌ లో నాతో కూర్చుని బన్నీ కబుర్లు చెప్పినట్లుగా వచ్చిన కలను ఎప్పటికి మర్చి పోలేను. ఆయనతో కలలో అయినా ముచ్చట్లు పెట్టాను అనే సంతోషం ఉంటుందని అనన్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. క్యూట్‌ గా అందంగా ఉండటంతో పాటు మంచి నటన ప్రతిభ ఉన్న అనన్య ముందు ముందు మంచి నటిగా పేరు దక్కించుకుంటుందనిపిస్తుంది.

ప్రస్తుతం బిటెక్‌ మూడవ సంవత్సరం చదువుతున్న అనన్య చదువు పూర్తి చేసి నటనపై మరింతగా శ్రద పెట్టబోతున్నట్లుగా చెప్పింది. హీరోయిన్ గా సినిమాల్లో వెబ్‌ సిరీస్ ల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా చెప్పిన అనన్య కు భవిష్యత్తులో అల్లు అర్జున్‌ తో కలిసి నటించే అవకాశం కూడా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈలోపే అల్లు అర్జున్‌ వద్దకు ఆమె వ్యాఖ్యలు చేరవేసి ఆమెను కలిసేలా బన్నీని ఒప్పించేందుకు కొందరు నెటిజన్స్ ఆయన్ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ లు పెడుతున్నారు.