Begin typing your search above and press return to search.

30 ప్ల‌స్ మెగా హీరోలు పెళ్లెప్పుడో తేలేదెలా

By:  Tupaki Desk   |   16 Aug 2020 10:30 AM IST
30 ప్ల‌స్ మెగా హీరోలు పెళ్లెప్పుడో తేలేదెలా
X
టాలీవుడ్ యంగ్ బ్యాచిల‌ర్స్ ఒక‌రొక‌రుగా ఓ ఇంటివాళ్ల‌యిపోతున్నారు. నిఖిల్.. నితిన్.. రానా ఇప్ప‌టికే త‌మ‌కు న‌చ్చిన స‌ఖిని ఎంచుకుని పెళ్లాడేసారు. లాక్ డౌన్ అటుపై అన్ లాక్ సీజ‌న్లు అలా క‌లిసొచ్చాయి మ‌రి. అయితే ఇంకా పెండింగ్ బ్యాచిల‌ర్స్ సంగ‌తేమిటి? ప్ర‌భాస్.. సందీప్ కిష‌న్..శ‌ర్వానంద్ లాంటి బ్యాచిల‌ర్స్ పెళ్లికి రెడీ అయ్యేదెపుడు? అంటే..

సందీప్ కిష‌న్ నుంచి గుడ్ న్యూస్ వ‌చ్చేయ‌నుంది. `పెద్ద అడుగు` అంటూ అత‌డు ఇప్ప‌టికే హింటిచ్చాడు. అభిమానుల స‌హ‌చ‌రుల‌ బ్లెస్సింగ్స్ కోరాడు. అంటే త్వ‌ర‌లోనే పెళ్లి వార్త చెబుతాన‌నే దీన‌ర్థం. అదంతా స‌రే కానీ మెగా హీరోల్లో బ్యాచిల‌ర్లు పెళ్లాడేదెపుడు? అన్న‌దానికి ఆ కాంపౌండ్ హీరోనే ఆన్స‌ర్ ఇచ్చారు.

ఇప్ప‌టికే నిహారిక నిశ్చితార్థం ఫిక్స‌య్యింది. డిసెంబ‌ర్ లో వివాహం జ‌ర‌గ‌నుంది. ఇది మెగా కుటుంబంలో చాలా ఇంపార్టెంట్ వేడుక‌. ఆ త‌ర్వాత సాయి తేజ్.. వ‌రుణ్ తేజ్.. అల్లు శిరీష్‌ లాంటి యువ‌హీరోలు వెయిటింగులో ఉన్నారు. వీళ్లకు పెళ్లి ఎప్పుడు? అంటే.. ``30 ప్లస్ లో ఉన్నారు. పెళ్లి క‌బురు వ‌చ్చేస్తుంద‌``నే అన్నారు రామ్ చ‌ర‌ణ్‌. ఇక నిహారిక పెళ్లి పూర్త‌యితే వ‌రుణ్ నుంచి క్లారిటీ వ‌చ్చే వీలుంది. 2021లో పెళ్లాడ‌తాన‌ని ఇంత‌కుముందు అత‌డు హింట్ ఇచ్చాడు. అలాగే సాయి తేజ్ ర‌క‌ర‌కాల డైల‌మాల నుంచి బ‌య‌ట‌ప‌డి త‌న పెళ్లికి సంబంధించిన‌ క‌బురు అందిస్తాడేమో చూడాలి.