Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ హీరోయిన్స్ ఈ ముగ్గురే

By:  Tupaki Desk   |   20 Dec 2019 10:05 AM GMT
ప‌వ‌న్ హీరోయిన్స్ ఈ ముగ్గురే
X
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొంత గ్యాప్ త‌ర్వాత‌ వెండితెరపై సందడి చేసేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. హిందీలో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి.. తమిళంలోనూ ఘ‌న‌విజ‌యం సాధించిన‌ `పింక్` రీమేక్ లో నటించేందుకు అంగీకరించారు. నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో ఈ సినిమా ఇంత‌కుముందు లాంఛనంగా ప్రారంభమైంది. `పింక్` రీమేక్ మ్యూజిక్ సిట్టింగ్స్ కి సంబంధించిన వివ‌రాలు ఇటీవ‌ల‌ వెల్ల‌డించారు. అయితే ఈ సినిమాలో క‌థానాయిక‌లు ఎవ‌రెవరు? అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు.

ఇంత‌కుముందు ఇద్ద‌రు నాయిక‌ల్ని ఫైన‌ల్ చేశార‌న్న ముచ్చ‌ట సాగింది. క్రేజీ మ‌ల‌యాళీ బ్యూటీ నివేదా థామస్ ను ఓ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారు. అలాగే తెలుగమ్మాయి అంజలికి వేరొక‌ కీలక పాత్రలో అవ‌కాశం ఇచ్చార‌ని ప్ర‌చార‌మైంది. మ‌రో కీల‌క నాయిక‌గా పింక్ ఒరిజిన‌ల్ లో న‌టించిన‌ తాప్సీనే ఎంపిక చేయాల‌ని భావించిన‌ట్టు ప్ర‌చార‌మైంది. అయితే తాప్సీ స్థానంలో వేరొక పేరు తాజాగా రివీలైంది. మ‌ల్లేశం చిత్రంలో న‌టించిన అన‌న్య‌ను ఫైన‌ల్ చేశార‌ని వార్త‌లొచ్చాయి. అన‌న్య సినిమాల్లోకి రాక‌ముందు సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ప్ర‌స్తుతం క‌థానాయిక‌గా బిజీ అవుతోంది.

ఈ ముగ్గురు భామ‌ల ఫోటోలు ప్ర‌స్తుతం గూగుల్ లో ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా ప‌వ‌న్ తో పాటుగా ఆ ముగ్గురినీ ఒకే ఫ్రేమ్ లో చేర్చిన ఫోటో అంత‌ర్జాలంలో వేడెక్కిస్తోంది. ముఖ్యంగా ప‌వ‌న్ అభిమానులు ట్విట్ట‌ర్.. ఇన్ స్టా ఖాతాల్లో ఈ ఫోటోని వైర‌ల్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ వేగంగా పూర్త‌వుతోంది. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం సంగీత దర్శకుడు తమన్ బాణీల్ని రెడీ చేస్తున్నారు. వేణూ శ్రీరామ్ స్క్రిప్టు ఆద్యంతం రెడీ చేసి.. మ్యూజిక్ సిట్టింగ్స్‌లో బిజీ అయ్యారు.