Begin typing your search above and press return to search.

WWE ముమైత్‌ ని చూశారా?

By:  Tupaki Desk   |   18 Aug 2018 7:00 AM IST
WWE ముమైత్‌ ని చూశారా?
X
ముంబై టు హైద‌రాబాద్ ఫిలిమ్‌ ఇండ‌స్ట్రీ ముమైత్ ఖాన్ జ‌ర్నీ గురించి తెలిసిందే. ``ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా ప‌ద‌హారే! `` అంటూ `పోకిరి` సినిమాతో టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. పూరి డిస్క‌వ‌రీగా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో స్థిర‌ప‌డింది. ఆ త‌ర్వాత ముమైత్ క‌థే వేరు. టాలీవుడ్‌ లో ఐటెమ్ భామ‌గా ద‌శాబ్ధం పాటు ఓ ఊపు ఊపేసింది. ముమైత్‌ నే క‌థానాయిక‌గా పెట్టి సినిమాలు తీసేందుకు నిర్మాత‌లు సూట్‌కేసులు ప‌ట్టుకుని తిరిగారంటే ఆ హిస్ట‌రీని ప‌దే ప‌దే త‌లుచుకోకుండా ఉండ‌లేం. అయితే ముమైత్ త‌ర‌హాలోనే ఈ అమ్మ‌డి క‌థ కూడా అంతే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఒక‌ప్పుడు ఎంతో వెలుగు వెలిగి - అటుపై ఫేడ‌వుట్ అయిపోయిన ఈ సెల‌బ్రిటీ కం రెజ్ల‌ర్ క‌థ ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

ఆవిడ ముఖంపై పంచ్‌ లు వేస్తుంది. శత్రువుకు చుక్క‌లు చూపిస్తుంది. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఇ క్రీడ‌లో గొప్ప‌ ఆట‌గ‌త్తె. ఫేమ‌స్ ఇంగ్లీస్ ప్రొఫెష‌న‌ల్‌ రెజ్ల‌ర్‌. రెండు సార్లు డ‌బ్ల్యూడ‌బ్ల్యూఇ దివాస్ ఛాంపియ‌న్‌గా నిలిచింది. ఫేమ‌స్ ఎన్ ఎక్స్‌ టీ ఛాంపియ‌న్‌ షిప్‌ ని గెలుచుకుంది. పైగా త‌నో న‌టి కూడా. సినిమాల్లో న‌టిస్తూ పేరు తెచ్చుకుంది. ఇంత‌కీ ఆవిడ పేరేంటి? అంటే .. సారయ జేడ్ బెవిస్‌. ప్ర‌ఖ్యాత `స్మాక్‌ డౌన్ లైవ్ బ్రాండ్‌` కంపెనీకి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌ గా ప‌ని చేసింది. 26వ‌య‌సు ఈ న‌టి కం రెజ్ల‌ర్ లైఫ్ పాథాస్ స్టోరి పాశ్చాత్య‌దేశాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే లైఫ్‌ లో ఊహించ‌ని ఓ కుదుపు. అదే సెక్స్ టేప్ స్కాండ‌ల్‌ లో ఈ అమ్మ‌డి పేరు బ‌య‌ట‌కు రావ‌డంతో లైఫ్‌ లో అస‌లైన‌ ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ క్ర‌మంలోనే తీవ్ర‌మైన‌ డిప్రెష‌న్‌ లోకి వెళ్లిందిట‌. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు డిప్రెష‌న్‌ లోకి వెళ్ల‌డంతో అన‌వ‌స‌ర ఫ్యాట్‌తో బాగా బ‌రువు పెరిగిపోయింది. దీంతో రెజ్ల‌ర్‌ గా తిరిగి ఛాన్సులు ద‌క్కించుకునేందుకు తీవ్రంగా శ్ర‌మించి పాత రూపాన్ని తిరిగి తెచ్చుకుందిట‌. ఇప్పుడంతా బిగ్ ఫాట్ పెయిజ్ అంటూ కామెంట్లు చేయ‌లేర‌ని సెల్ఫీల్ని ఇన్‌ స్టాలో పోస్ట్ చేసింది. మొత్తానికి ఐటెమ్ గాళ్ టు డ్ర‌గ్స్ స్కాండ‌ల్‌..త‌ర‌హాలో ముమైత్ ఖాన్ అంత స్టోరి ఉంది ఈ అమ్మ‌డికి.