Begin typing your search above and press return to search.

ముస్తఫా ముస్తఫా.. 'మళ్లీ వస్తా' ముస్తఫా..!

By:  Tupaki Desk   |   23 Oct 2022 7:30 AM GMT
ముస్తఫా ముస్తఫా.. మళ్లీ వస్తా ముస్తఫా..!
X
సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల పుట్టిన రోజులు, ఇతరత్రా ముఖ్యమైన పర్వదినాలను పురస్కరించుకొని దర్శక, నిర్మాతలు తమ సినిమాలను రీ రిలీజు చేస్తున్నారు. 1980-90, 1990-20లో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్లు నిలిచిన సినిమాలన్నీ మాస్టర్ ప్రింట్ లో విడుదలవుతూ నేటి యూత్ ను ఆకట్టుకుంటున్నాయి.

తెలుగులో పవన్ కల్యాణ్ 'జల్సా'.. మెగాస్టార్ చిరంజీవి 'ఇంద్ర'.. నందమూరి బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి' మూవీలు రీ రిలీజై అభిమానులను అలరించడంతో భారీ వసూళ్లను రాబట్టాయి. ఇక నేడు 'డార్లింగ్' ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 'బిల్లా' మూవీ సైతం మాస్టర్ ప్రింట్ తో విడుదలైంది. ఇక ఈ ట్రెండ్ గత 25ఏళ్ల క్రితం రిలీజైన సూపర్ హిట్ ప్రేమకావ్యం 'ప్రేమదేశం'ను తాకింది.

1996లో విడుదలైన 'ప్రేమదేశం' నాటి యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఏఆర్ రెహమన్ సంగీతం సమకూర్చాడు. ఇందులోని ప్రతీపాట మ్యూజికల్ హిట్టుగా నిలిచింది. 'ముస్తఫా ముస్తఫా.. డోంట్ వర్రీ ముస్తఫా..' అంటూ స్నేహం గొప్పతనం గురించి సాగే పాట కొన్నేళ్లపాటు ప్రతీ కాలేజ్ ఫంక్షన్లో వినబడింది.

'కాలేజీ స్టయిలే'.. 'హాలో డాక్టర్'..'నన్ను నేనే మరిచనే'.. 'వెన్నలా.. వెన్నలా..' వంటి సాంగ్స్ యూత్ ను కట్టిపాడేశాయి. ఇద్దరు స్నేహితులు ఒకే అమ్మాయిని గాఢంగా ప్రేమించే కథాంశంతో 'ప్రేమదేశం' తెరకెక్కింది. టబూ, అబ్బాస్, వినీత్ లు కాలేజ్ స్టూడెంట్స్ గా, ప్రేమికులుగా అద్భుతంగా నటించారు. దీంతో ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేనల్ హిట్ అయింది.

ఈ మూవీ తర్వాత టబూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అబ్బాస్, వినీత్ లు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. 90 దశాబ్దంలో వచ్చిన ఈ అద్భుత ప్రేమకావ్యాన్ని శ్రీ మాతా క్రియేషన్స్ రీ రిలీజు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉంది. దాదాపు 25ఏళ్ల తర్వాత వస్తున్న 'ప్రేమదేశం' మూవీని నేటి యూత్ ఎలా ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.