Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ 20: 25 భారీ సెట్ల‌ కు 50 కోట్లు ఖ‌ర్చు ?

By:  Tupaki Desk   |   15 Nov 2019 6:32 AM GMT
ప్ర‌భాస్ 20: 25 భారీ సెట్ల‌ కు 50 కోట్లు ఖ‌ర్చు ?
X
ప్ర‌భాస్ క‌థా నాయ‌కుడిగా న‌టిస్తున్న 20వ సినిమా రెండేళ్లుగా హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు సాహో చిత్రీ క‌ర‌ణ సాగుతుండ‌గానే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేయ‌డం తో ప్ర‌భాస్ అభిమానుల్లో దీనిపై విస్త్ర‌తం గా చ‌ర్చ సాగింది. ఈ సినిమా కి జాన్ అనే టైటిల్ ని అనుకుంటున్నారు. ప్ర‌భాస్ ఇందు లో యూర‌ప్ కి చెందిన‌ రిచ్ వింటేజ్ కార్స్ బిజినెస్ మేన్ గా క‌నిపిస్తారు. అలాగే పూజా హెగ్డే ఓ పేద అమ్మాయి గా క‌నిపిస్తుంది. ఒక పేద అమ్మాయిని ప్రేమించే రిచ్ బిజినెస్ మేన్ స్టోరి ఇది అంటూ నెటిజ‌నులు ఒక‌టే క‌థ‌లు అల్లేశారు. యూర‌ప్ లో షెడ్యూల్ ని ప్రారంభించ‌డం తో ఇక సినిమా వేగం గా పూర్త‌వుతుంద‌నే అనుకున్నారు.

అయితే `సాహో` ప‌రాజ‌యం తో ప్ర‌భాస్ అండ్ టీమ్ బ‌డ్జెట్ల‌పై రివ్యూ చేసుకుని ఈసారి చాలా ప‌క‌డ్భందీ గా వెళుతున్నార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. యూవీ క్రియేష‌న్స్ - గోపికృష్ణ బ్యాన‌ర్లు చాలా సీరియ‌స్ గానే ఈ సినిమా పై దృష్టి సారించాయ‌ని అర్థ‌మ‌వుతోంది. ఎంపిక చేసుకున్న క‌థ‌ కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా సెట్స్ వేస్తున్నారు. అవ‌స‌రం మేర‌ బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నార‌ని తాజా ప్ర‌య‌త్నం చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది.

ఇంత‌కు ముందు యూర‌ప్ కి వెళ్లాల‌ని భావించారు కానీ.. ఇప్పుడు రామోజీ ఫిలింసిటీ లోనే యూర‌ప్ న‌గ‌రాన్ని క్రియేట్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అందుకోసం ఏకంగా 25 భారీ సెట్లు వేస్తున్నారు. అచ్చం యూర‌ప్ న‌గ‌రాన్ని త‌ల‌పించేలా.. అది కూడా 1980ల నాటి వింటేజ్ న‌గ‌రాన్ని రీ క్రియేట్ చేస్తున్నార‌ట‌. ఇందులోనే చాలా వ‌ర‌కూ కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తార‌ని తెలుస్తోంది. అందుకే ఈ సెట్స్ కోస‌మే దాదాపు 40-50కోట్లు వెచ్చించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈనెల 18 నుంచి రెగ్యుల‌ర్ చిత్రీ క‌ర‌ణ‌కు రెడీ అవుతోంది చిత్ర‌ బృందం. ఈ సినిమా కోసం ఏకంగా 150-180 కోట్ల మేర బ‌డ్జెట్ ని ఖ‌ర్చు చేస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. సైరా ఫేం అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.