Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ తొలిప్రేమకు 24 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?

By:  Tupaki Desk   |   24 July 2022 11:30 AM GMT
పవర్ స్టార్ తొలిప్రేమకు 24 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలన్నిటిలో కూడా కొన్ని సినిమాలకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇక అందులో ఆయనను యువతకు ఎక్కువగా దగ్గర చేసిన సినిమాల్లో తొలి ప్రేమ ఒకటి. ఇప్పటికి కూడా ఆ సినిమా నేటి తరం జనరేషన్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. అందులో పాటలు అలాగే పవన్ కళ్యాణ్ నటన లవ్ సీన్స్ మిగతా కామెడీ సీన్స్ ఇలా అన్ని రకాలుగా కూడా సినిమా ప్రేక్షకులను ఎంతగానో అకట్టుకున్నాయి.

ఇక ప్రముఖ దర్శకుడు కరుణాకర్ కు కూడా అదే మొదటి సినిమా. తమిళ్ చిత్ర పరిశ్రమలో ప్రేమదేశం సినిమాకు సహాయక దర్శకుడిగా పని చేసిన తర్వాత అతనికి సొంత భాషలోనే చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయాలి అని ప్రత్యేకంగా హైదరాబాద్ కు వచ్చి మరి తను కథను చెప్పాడు. కరుణాకరన్ మొదట కథను చెప్పిన తర్వాత కొన్ని రోజులు ఆలోచించుకున్న పవన్ కళ్యాణ్ రెండవసారి సిట్టింగ్లో మాత్రం మళ్లీ కథను మార్చి చెప్పడంతో వెంటనే గ్రీన్ సెగ్నల్ ఇచ్చేశాడు.

ఇక ఆ సినిమా విడుదలై నేటికీ 24 ఏళ్లు కావస్తోంది. 1998లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన తొలిప్రేమ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 9 కోట్ల కలెక్షన్స్ అందుకొని అప్పట్లో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధికంగా ప్రాఫిట్స్ అందించిన సినిమాగా కూడా క్రేజ్ అందుకుంది.

ఇక ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ ఒక్కసారిగా మరో లెవల్ కు పెరిగిపోయింది. అలాగే దర్శకుడు కరుణాకరన్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఆ సినిమాకు దేవా అందించిన సంగీతం కూడా ఎంతగానో ఉపయోగపడింది. అందులోని సినిమా పాటలు ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తూ ఉంటాయి. ఇక 2018లో వరుణ్ తేజ్ తొలిప్రేమ టైటిల్ తోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.