Begin typing your search above and press return to search.

2023 సంక్రాంతి ఫైట్.. రిలీజ్ డేట్స్ ఫిక్స్!

By:  Tupaki Desk   |   1 Dec 2022 5:50 AM GMT
2023 సంక్రాంతి ఫైట్.. రిలీజ్ డేట్స్ ఫిక్స్!
X
సంక్రాంతి అనగానే బడా సినిమాలకు ఒక మంచి జాక్ పాటు లాంటిది అని చెప్పవచ్చు. ఈ ఫెస్టివల్ సీజన్లో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఊహించని రేంజ్ లో ఉంటాయి. పెట్టిన పెట్టుబడి మొత్తం రెండు మూడు రోజుల్లో వెనక్కి వచ్చేస్తుంది.

ఇక తర్వాత వచ్చేదంతా కూడా లాభమే. అందుకే అగ్ర హీరోలు ప్రముఖ నిర్మాతలు దర్శకులు అందరూ కూడా పొంగల్ ఫెస్టివల్ ను వీలైనంతవరకు వాడుకునేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. పోటీ ఎంత ఉన్నా కూడా సంక్రాంతి అనేది సౌత్ ఇండస్ట్రీకి చాలా ప్రత్యేకమైనది.

అయితే 2023 సంక్రాంతి టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వందల కోట్ల టర్నోవర్ చూడబోతోంది. ఇక ఈసారి తమిళ్ వర్సెస్ తెలుగు హీరోల మధ్యలో కూడా పోటీ గట్టిగానే నెలకొంది. ముఖ్యంగా తెలుగులో అయితే నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో పాటు వాల్తేరు వీరయ్య కూడా విడుదల కాబోతోంది. దిల్ రాజు వారసుడు సినిమాను కూడా భారీ స్థాయిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నాడు.

ఇక ఈ సినిమాల రిలీజ్ డేట్స్ దాదాపు ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ముందుగా జనవరి 12వ తేదీన వీర సింహారెడ్డి సినిమా విడుదలవుతుండగా.. జనవరి 13న వాల్తేరు వీరబోతోంది. విజయ్ వారసుడు సినిమాను వీరాసింహారెడ్డికి పోటీగా జనవరి 12వ తేదీన విడుదల చేసే అవకాశం అయితే ఉంది.

ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా తమిళ విడుదల తేదీ పై అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి తెలుగులో కూడా భారీగానే అదే సమయంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఇక అజిత్ కుమార్ నటించిన తునివు సినిమా కూడా తమిళంలో పాటు తెలుగులో కూడా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే అజిత్ నటించిన కొన్ని సినిమాలు ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. అందుకే బయ్యర్స్ ఆ సినిమాను తెలుగులో కూడా విడుదల చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. మరి ఈ సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్లో ఏ హీరో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.