Begin typing your search above and press return to search.

2023 NYE ఆదిపురుష్ సీత ఓహ్..! వ్వాటే చిల్!

By:  Tupaki Desk   |   3 Jan 2023 6:30 AM GMT
2023 NYE ఆదిపురుష్ సీత ఓహ్..! వ్వాటే చిల్!
X
శ్రీ‌రామ‌రాజ్యం సినిమాలో న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ శ్రీ‌రాముడిగా న‌టించ‌గా న‌య‌తార సీత‌గా న‌టించారు. ఆ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో న‌య‌న‌తార నాన్ వెజ్ తిన‌డం పూర్తిగా మానేశాన‌ని తెలిపారు. అంతేకాదు.. అల్ట్రామోడ్ర‌న్ దుస్తుల్లో చిట్టి పొట్టి బికినీల్లో కానీ క‌నిపించ‌లేదు. పార్టీ క్రౌడ్ లో చిలౌట్ మూవ్ మెంట్స్ కూడా ఎక్కడా ద‌రిదాపుల్లో క‌నిపించ‌లేదు. మ‌హాసాధ్వి సీత‌గా న‌టిస్తున్నందుకు తాను సీతాదేవికి ఆరాధ‌కురాలిన‌య్యాన‌ని త‌న ఆద‌ర్శాలు అంత‌గా న‌చ్చుతాయ‌ని.. అందుకే తాను మారిపోయాన‌ని కూడా తెలిపారు న‌య‌న్.

దీనినే ఒక పాత్ర కోసం క‌మిట్ మెంట్ అంటారు. కానీ ఇప్పుడు 'ఆదిపురుష్' చిత్రంలో సీతాదేవి పాత్ర‌లో న‌టిస్తోంది ముంబై బ్యూటీ కృతి స‌సోన్. ప్ర‌భాస్ ఇందులో శ్రీ‌రాముడిగా న‌టిస‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్- కృతి స‌నోన్ జంట సీతారాములుగా అద్భుతంగా కుదిరార‌ని చిత్ర‌బృందం గుస‌గుస‌లాడుకుంటోంది.

ఇదిలా ఉండ‌గానే 2023 కొత్త సంవ‌త్స‌రం సెల‌బ్రేష‌న్స్ లో సీతాదేవి పాత్ర‌ధారి కృతి చిల్లింగ్ మూవ్ మెంట్ చూసి అభిమానులు షాక్ తిన్నారు. టూమ‌చ్ పోష్ .. అల్ట్రా మోడ్ర‌న్ లుక్ లో చిల్లింగ్ గా కనిపించింది ఈ బ్యూటీ. డిసెంబ‌ర్ 31 మిడ్ నైట్ పార్టీలో కృతి స‌నోన్ చిలౌట్ చేసిన తీరు ఇప్పుడు మ‌హాసాధ్వి సీతాదేవి ఆరాధ‌కుల్లో చ‌ర్చ‌కు వచ్చింది.

కృతి సనన్ సోషల్ మీడియా యూజర్ గా ఎప్ప‌టిక‌ప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో చెల‌రేగ‌డం చూస్తున్న‌దే. కానీ సీత పాత్ర‌లో న‌టిస్తున్నందుకు అయినా ఆ పాత్ర తాలూకా ఔచిత్యాన్ని ప్ర‌ద‌ర్శించే రూపంతో క‌నిపించాలి క‌దా? అనేది అభిమానుల సందేహం. కానీ అవ‌న్నీ తూచ్ అనేసింది అంటూ అభిమానుల్లో గుస‌గుస‌లు సాగుతున్నాయి. న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ లో హ‌ద్దులు చెరిపేసి కృతి స‌నోన్ చెల‌రేగింది. ఆమె తన హాటెస్ట్ ఫోటోలు వీడియోలను షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. భానుని లేలేత కిర‌ణాలు ఈ అమ్మ‌డి వ‌ద‌నంపై ప్ర‌స‌రించ‌గా హ‌ద్దే లేని ఆనందంతో కృతి క‌నిపిస్తోంది.

ఆరంభ‌మే అద‌ర‌గొట్టేసింది!

2023ని ఫుల్ గా చిల్ చేస్తాన‌ని ఆరంభ‌మే హింట్ ఇచ్చింది. న్యూఇయ‌ర్ పార్టీకి సంబంధించిన‌ స్నాప్ లో కృతి ఎంతో అందంగా చిరునవ్వుతో మెరిసిపోయింది. అల్ట్రా మోడ్ర‌న్ డిజైన‌ర్ టాప్ లో టూ హాట్ గా క‌నిపించింది. ఈ నెక్ లైన‌ర్ ప్రింటెడ్ టాప్ టూ హాట్ అంటూ ఇప్పుడు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కృతి ఈ ఫోటోకి అంద‌మైన క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. "నాకు ఆనందాన్నిచ్చే అంద‌మైన ప్రదేశం! 2023 బీచ్ లో సూర్యుని కిర‌ణాల ప్ర‌సారం నుంచి ప్రారంభమైంది! నా హృదయంలో సూర్యుని లోని అగ్ని జ్వ‌లిస్తుండ‌గా.. ఉప్పగా ఉండే వస్త్రాలతో త‌డిసిముద్ద‌య్యాను. కృతజ్ఞతలు- 2023.. ఈరోజు మంచి అనుభూతిని పొందాను" అని వ్యాఖ్య‌ను జోడించింది. దీనికి ప్ర‌తిస్పంద‌న‌గా అభిమానులు వ్యాఖ్యల‌ విభాగంలో ర‌క‌ర‌కాల వ్యాఖ్య‌ల‌ను జోడించారు. ఆదిపురుష్ సీతాదేవి మ‌రీ ఈ రేంజులో చెల‌రేగిపోవ‌డ‌మా? అంటూ కొంద‌రు వ్యాఖ్యానించారు.

కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల కోసం కృతి స‌నోన్ తో పాటు కియారా అద్వానీ - సిద్ధార్థ్ మల్హోత్రా -మలైకా అరోరా త‌దిత‌ర సెల‌బ్రిటీలు విదేశాకు వెళ్లారు. వీరంతా వేర్వేరు సమయాల్లో ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు కెమెరా ఫ్లాష్ లు మెరిసాయి. కృతి సనన్ నలుపు-నీలం రంగు దుస్తులను ధరించి విమానాశ్ర‌యంలో క‌నిపించింది.

ప్ర‌భాస్ తో డేటింగ్ పై క్లారిటీ

'ఆదిపురుష్‌' సహనటుడు ప్ర‌భాస్ తో తాను డేటింగ్‌ చేస్తున్నట్టు వచ్చిన పుకార్లపై ఇటీవ‌లే కృతి స‌నోన్ స్పందించిన సంగ‌తి తెలిసిందే. త‌మ‌మ‌ధ్య అలాంటిదేదీ లేద‌ని ..అవ‌న్నీ గాలి వార్త‌లేన‌ని ఖండించింది. ఇటీవ‌ల ప్రభాస్ కూడా దీనిపై స్పందించారు. 'అన్ స్టాపబుల్ విత్ NBK 2' చాట్ షోలో కనిపించిన డార్లింగ్ .. కృతి తో డేటింగ్ రూమర్స్ గురించి స్పందించారు.

ఎన్బీకే ఈ ప్ర‌శ్న అడ‌గ్గానే .. ప్ర‌భాస్ త‌న‌దైన శైలిలో దానిని ఖండించారు. "అది పాత వార్త సార్. అలాంటిదేమీ లేదని మేడమ్ నుండి క్లారిటీ కూడా వచ్చింది! అంటూ కృతి పైనే నెట్టేశాడు తెలివిగా. త్వ‌ర‌లో వెడ్డింగ్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అని ఎన్బీకే ప్ర‌శ్నించ‌గా..."ఐడియా లేదు సార్.. నాకు ఇంకా తెలీదు.. తప్పకుండా పెళ్లి చేసుకుంటాను.. కానీ నా డెస్టినీలో ఇంకా రాసిపెట్టిలేదు" అని ప్రభాస్ చెప్పాడు. మొత్తానికి ప్ర‌భాస్-కృతి డేటింగ్ వ్య‌వ‌హారంపై అభిమానులకు పూర్తి క్లారిటీ వ‌చ్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.