Begin typing your search above and press return to search.

2022 యూఎస్ బాక్సాఫీస్.. టాప్ 10 మూవీస్!

By:  Tupaki Desk   |   12 Dec 2022 12:30 PM GMT
2022 యూఎస్ బాక్సాఫీస్.. టాప్ 10 మూవీస్!
X
2022 ఇండియన్ సినిమా పరిశ్రమకు చాలా వరకు హెల్ప్ అయ్యింది అనే చెప్పాలి. గత రెండేళ్ల కాలం కూడా దాదాపు కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీలో థియేట్రికల్ బిజినెస్ కు భారీ దెబ్బ పడిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి మళ్లీ థియేటర్లలో ఎప్పటిలానే జనాలు పూర్తిస్థాయిలో కనిపిస్తున్నారు. అయితే కంటెంట్ బాగుంటేనే ఆడియన్స్ సినిమాలు చూసేందుకు థియేటర్స్ కు వస్తున్నారు.

ఇక 2022లో అత్యధిక స్థాయిలో యూఎస్ లో కూడా ఇండియన్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక అమెరికాలో 2022లో అత్యధిక బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఇండియన్ సినిమాల లిస్టు ఈ విధంగా ఉంది. ముందుగా అత్యధిక మిలియన్ డాలర్స్ అందుకున్న సినిమాగా టాలీవుడ్ ఫ్యాన్ ఇండియా సినిమా RRR నిలిచింది. దర్శక ధీరుడు రాజమౌళి తీసుకువచ్చిన RRR సినిమా 14. 5 డాలర్లను సొంతం చేసుకుంది.

ఇక రెండవ స్థానంలో ఉన్న బ్రహ్మాస్త్ర సినిమా 7.6 మిలియన్ల డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 7.4 మిలియన్ల డాలర్స్ అందుకోగా ఆ తర్వాత తమిళం ఫ్యాన్ ఇండియా మూవీ పీఎస్ వన్ 6.7 మిలియన్ల ఫాలోవర్స్ తో అందుకుంది. ఇక ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న చిన్న బడ్జెట్ మూవీలలో పొన్నియిన్ సెల్వన్ ఒకటి. ఈ సినిమాలో 6.7 మిలియన్ డాలర్స్ సొంతం చేసుకుంది.

ఇక అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ టాక్ అందుకున్నప్పటికీ కూడా యూఎస్ లో ఈ సినిమా 3.37 మిలియన్ న్ డాలర్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఆలియా భట్ డిఫరెంట్ బోల్డ్ మూవీ గంగుబాయి కతియావాడి 3.32 మిలియన్ డాలర్స్ లో రాబట్టింది. ఇటీవల అజయ్ దేవగన్ దృశ్యం 2 సినిమాతో హిందీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఈ సినిమా 3.18 మిలియన్ డాలర్లను రాబట్టింది. మరో తమిళ మూవీ విక్రమ్ అన్ని భాషల్లో కలుపుకొని అమెరికాలో 2.85 మిలియన్ డాలర్స్ ను కలెక్ట్ చేసింది. ఇక హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన భూల్ బులియా 2 సినిమా 2.56 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసి మంచి ప్రాఫిట్ సొంతం చేసుకుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.