Begin typing your search above and press return to search.

2022 స్పెష‌ల్: #ET తో పాన్ ఇండియా వార్ లో సూర్య‌!

By:  Tupaki Desk   |   2 Jan 2022 2:30 AM GMT
2022 స్పెష‌ల్: #ET తో పాన్ ఇండియా వార్ లో సూర్య‌!
X
`ఆకాశం నీ హ‌ద్దురా` చిత్రంతో సూర్య త‌న కెరీర్ బెస్ట్ క్రిటిక‌ల్ ప్ర‌శంస‌ల‌తో పాటు.. సూప‌ర్ హిట్ ని అందుకున్నాడు. కొన్ని వ‌ర‌స ప‌రాజ‌యాల త‌ర్వాత సుధ కొంగ‌ర రూపంలో లేడీ డైరెక్ట‌ర్ త‌న‌కు అద్భుత విజ‌యాన్ని ఇవ్వ‌డంతో సూర్య అటుపై మ‌రింత కాన్ఫిడెంట్ గా వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ బిజీ అయ్యాడు. నిర్మాత‌గా జ్యోతిక‌తో కలిసి సినిమాల‌ను నిర్మిస్తున్నాడు.

తాజాగా నూత‌న‌సంవ‌త్స‌రంలోకి ప్ర‌వేశిస్తున్న వేళ సూర్య న‌టిస్తున్న కొత్త సినిమా టైటిల్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. ఎథ‌ర‌క్కుమ్ తునిన్ద‌వ‌న్ (ఇటి) టైటిల్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసి విషెస్ తెలిపారు. పాండిరాజ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఇందులో స‌త్య‌రాజ్ లాంటి సీనియ‌ర్ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ప్రియాంక మోహ‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.
#ET #ఈటి #ಈಟಿ #ഇറ്റി #ईटी అంటూ నాలుగు హ్యాష్ ట్యాగుల్ని వైర‌ల్ చేస్తున్న తీరును బ‌ట్టి ఈ మూవీ కూడా పాన్ ఇండియా మూవీ అని భావించాల్సి ఉంటుంది. #ET అంటూ రెండ‌క్ష‌రాల టైటిల్ ని సూర్య టీమ్ వైర‌ల్ గా ప్ర‌మోట్ చేస్తూ పాన్ ఇండియా ఫీల‌ర్స్ ని వ‌దులుతున్నారు. పాండిరాజ్ లాంటి అవార్డ్ రేంజ్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమాగా ఈటీకి అంతే బ‌జ్ ఉంది.