Begin typing your search above and press return to search.

పబ్లిక్ ఒపీనియన్: 2022 సంక్రాంతి విన్నర్ గా నిలిచే సినిమా..?

By:  Tupaki Desk   |   10 Aug 2021 2:30 AM GMT
పబ్లిక్ ఒపీనియన్: 2022 సంక్రాంతి విన్నర్ గా నిలిచే సినిమా..?
X
టాలీవుడ్ లో 2022 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోలు పోటీ పడనున్నారు. ఎన్నడూ లేని విధంగా ముగ్గురు స్టార్ హీరోలు ఐదు నెలల ముందుగానే రిలీజ్ డేట్స్ ప్రకటించగా.. ఒక సీనియర్ స్టార్ హీరో పండక్కి బరిలో దిగనునట్లు హింట్ ఇచ్చారు. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' ౼ పవన్ కళ్యాణ్ 'PSPKRana' ౼ ప్రభాస్ 'రాధే శ్యామ్' ౼ వెంకటేష్ 'ఎఫ్ 3' చిత్రాలు ఒకే సీజన్ లో రాబోతున్నాయి. దీంతో వచ్చే సంక్రాంతి చాలా రసవత్తరంగా ఉండబోతోందని అర్థం అవుతోంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి విన్నర్ గా నిలిచే సినిమా ఏదని తెలుసుకోడానికి 'తుపాకీ డాట్ కామ్' ఓ పోల్ నిర్వహించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' రీమేక్ చిత్రానికి ఈ పోల్ లో అత్యధికంగా 35.99% మంది ఓటేశారు. 'వకీల్ సాబ్' తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అర్థం అవుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భీమ్లా నాయక్ అనే పోలీస్ అధికారిగా పవన్ కనిపించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న 'PSPKRana' చిత్రాన్ని 2022 జనవరి 12న విడుదల చేయనున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్.. మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకుంటారని 30.21% మంది నమ్ముతున్నారు. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ - జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మహేష్ పుట్టినరోజు కానుకగా తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దశాబ్దం తర్వాత సంక్రాంతి పండక్కి రిలీజ్ చేస్తున్న 'రాధే శ్యామ్' చిత్రానికి ఈ పోల్ లో 11.69% మంది మద్దతు తెలిపారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వింటేజ్ లవ్ డ్రామాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ నటిస్తున్న లవ్ స్టొరీ ఇది. ఇందులో విక్రమాదిత్య గా ప్రభాస్.. ప్రేరణ పాత్రలో పూజా కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ - టీ సిరీస్ - గోపీకృష్ణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ''ఎఫ్ 3''. ఇది సూపర్ హిట్ 'ఎఫ్ 2: ఫన్ అండ్ ఫస్ట్రేషన్' ఫ్రాంచైజీలో రూపొందే సినిమా. బ్లాక్ బస్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కి వస్తే తప్పకుండా విన్నర్ గా నిలుస్తుందని 11.48% మంది నమ్ముతున్నారు. 'ఎఫ్ 2' చిత్రం రెండేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చి సక్సెస్ అవడంతో.. ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేస్తే అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా - మెహ్రీన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇకపోతే ఈ పోల్ లో 2022 సంక్రాంతికి ఇంకా ఐదు నెలల సమయం ఉండటంతో.. విన్నర్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేమని 10.62% మంది అంటున్నారు.