Begin typing your search above and press return to search.

2022 మల్టీస్టారర్ హంగామా..!

By:  Tupaki Desk   |   17 Dec 2022 11:30 PM GMT
2022 మల్టీస్టారర్ హంగామా..!
X
వెండితెర మీద ఒక స్టార్ హీరో కనిపిస్తేనే విజిల్స్ వేసి అరుపులు కేకలు వేస్తారు. అలాంటి తెర మీద ఇద్దరు స్టార్స్ కనిపిస్తే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఈ ఏడాది ఆడియన్స్ లక్ అనుకోవాలో ఏమో కానీ దాదాపు ఏడు క్రేజీ మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకదానికి మించి మరొక కాంబో అనేలా ఈ మల్టీస్టారర్స్ వచ్చాయి. సంక్రాంతికి మొదలైన ఈ మల్టీస్టారర్ హంగామా దసరా వరకు కొనసాగింది.

ఈ ఏడాది వచ్చిన మల్టీస్టారర్ సినిమాల గురించి ఒకసారి చూస్తే.. సంక్రాంతికి బరిలో బంగార్రాజు వచ్చాడు. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. సోగ్గాడే చిన్ని నాయనా మూవీకి ప్రీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా అక్కినేని ఫ్యాన్స్ నే కాదు సినీ లవర్స్ ని అలరించింది. మనం తర్వాత నాగ చైతన్య, నాగార్జున మరోసారి బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్నారు.

ఇక ఈ ఏడాది మెగా మల్టీస్టారర్ గా వచ్చిన సినిమా ఆర్.ఆర్.ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వెండితెర మీద అద్భుతాలు చేసింది. మెగా, నందమూరి హీరోల మల్టీస్టారర్ అని చెప్పి వారి ఫ్యాన్స్ చేత కూడా సూపర్ అనిపించేలా చేశాడు జక్కన్న. ఎన్.టి.ఆర్, చరణ్ ల కాంబో వెండితెర మీద క్రేజీ కాంబోగా సెట్ అయ్యింది.

ఇదే లిస్ట్ లో భీమ్లా నాయక్ కూడా ఉంది. మళయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ గా ఈ సినిమా వచ్చింది. భీమ్లా నాయక్ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. త్రివిక్రం డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేశారు. పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నా సరే తనకు ఇచ్చిన డ్యానియల్ పాత్రలో రానా పవన్ కి ధీటుగా చేశాడని చెప్పొచ్చు. ఈ ఏడాది వచ్చిన మరో క్రేజీ మల్టీస్టారర్ ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. మెగా మల్టీస్టారర్ గా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అవడం పట్ల మెగా హీరోలతో పాటుగా మెగా ఫ్యాన్స్ కూడా చాలా అప్సెట్ అయ్యారు.

2022 లో మల్టీస్టారర్ గా వచ్చిన మరో సినిమా వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన F3. అనీల్ రావిపుడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర పాస్ మార్కులు కొట్టేసింది. F2 లో ఉన్నంత ఫన్ అండ్ ఎంటర్టైన్ మెంట్ ఈ సినిమాలో లేదని మాత్రం చెప్పొచ్చు. ఇక ఈ ఏడాది వచ్చిన మరో క్రేజీ మల్టీస్టారర్ గాడ్ ఫాదర్. చిరు సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. ఉన్నంతసేపు ఈ కాంబో సూపర్ గా అనిపించింది. అయితే ఫైనల్ రిజల్ట్ మాత్రం గాడ్ ఫాదర్ కూడా నిరాశపరచింది.

విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారు. అసలు ఈ సినిమాకు వెంకీ ఓకే చెప్పడం షాక్ ఇచ్చింది. విశ్వక్ సేన్ లాంటి యువ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెంకటేష్ మంచి మనసును తెలియచేస్తుంది. తమిళంలో హిట్టైన ఓ మై కడవులే సినిమాకు రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఓపెనింగ్స్ బాగున్నా ఫైనల్ రిజల్ట్ మాత్రం జస్ట్ యావరేజ్ గా నిలిచింది ఓరి దేవుడా.

2022 తెలుగులో భారీ మల్టీస్టారర్స్ వచ్చాయి. కొన్ని కాంబినేషన్స్ నిరాశ పరచినా మరికొన్ని సినిమాలు మాత్రం అద్భుతాలు సృష్టించాయి. వచ్చే ఏడాది కూడా మల్టీస్టారర్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. మరి ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాది అవి ఎక్కువ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలని ఆశిద్దాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.