Begin typing your search above and press return to search.

2022 బాక్సాఫీస్.. తెలుగులో బాక్సాఫీస్ ఊచకోత

By:  Tupaki Desk   |   8 Dec 2022 4:30 PM GMT
2022 బాక్సాఫీస్.. తెలుగులో బాక్సాఫీస్ ఊచకోత
X
గత రెండేళ్ల కాలం కూడా కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టాలు వచ్చాయి. ఎంతో మంది నిర్మాతలు సినిమాలను థియేట్రికల్ గా విడుదల చేసుకోలేక ఓటీటీలకు అమ్మేసుకున్నారు. అయితే 2002 మాత్రం ఒక విధంగా తెలుగు చిత్ర పరిశ్రమకు బాగా కలిసి వచ్చింది. తమిళ్ బాలీవుడ్ కంటే కూడా మన ఇండస్ట్రీలోనే సక్సెస్ రేట్ ఎక్కువ స్థాయిలో పెరగడం విశేషం. ఇక ఈ ఏడాది తెలుగులో అత్యధిక స్థాయిలో బాక్సాఫీస్ ప్రాఫిట్స్ అందించిన సినిమాల వివరాల్లోకి వెళితే.

ముందుగా RRR సినిమా గురించి చెప్పుకోవాలి. దర్శకధీరుడు రాజమౌళి తెరపైకి తీసుకువచ్చిన ఈ బిగ్ మల్టీస్టారర్ మూవీ 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందించింది. ఇక నిర్మాతలకు ఈ సినిమా దాదాపు 150 కోట్ల వరకు ప్రాఫిట్ అందించినట్లు తెలుస్తోంది. ఇక లిమిటెడ్ బడ్జెట్ లో వచ్చిన కార్తికేయ 2 సినిమా కూడా బాగానే ఆడింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి.

మొత్తంగా కార్తికేయ 2 సినిమా నిర్మాతలకు 45.5 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ అందించాయి. ఇక సీతారామమ్ సినిమా కూడా ఊహించిన విధంగా లాభాలు అందించింది. ఈ సినిమా 29 కోట్ల వరకు ప్రాఫిట్ అందించినట్లు సమాచారం. ఇక అక్టోబర్లో విడుదలైన బింబిసార సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక స్థాయిలో ప్రాఫిట్ అందించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

ఒక విధంగా ఆ చిత్రం కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో లాభాలను అందించిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా నిర్మాతలకు బింబిసార వలన 22 కోట్లు దక్కాయి. అలాగే అడవి శేష్ మేజర్ సినిమా కూడా ఫ్యాన్ ఇండియా మార్కెట్ కు తగ్గట్టుగానే బాగానే ఆడింది. ఈ సినిమా టోటల్ గా మహేష్ బాబుకు అలాగే వారి పాట్నర్స్ కు 14 కోట్ల వరకు ప్రాఫిట్ అందించినట్లు సమాచారం. సంక్రాంతికి వచ్చిన డీజే టిల్లు సినిమా కూడా దాదాపు 8 కోట్ల రేంజ్ లో అయితే ప్రాఫిట్ అందించింది.

కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో డబ్బింగ్ సినిమాలకు కూడా 2022 ఏడాది బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా అల్లు అరవింద్ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన కన్నడ కాంతార మూవీ 25 కోట్ల వరకు ప్రాఫిట్ అందించడం విశేషం. ఇక కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాను హీరో నితిన్ వారి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో తెలుగులో విడుదల చేశారు.

ఆ సినిమా ద్వారా వారికి పది కోట్లు దక్కాయి. ఇక బాలీవుడ్ బిగ్ మూవీ బ్రహ్మాస్త్ర 1 కూడా తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు మంచి ప్రాఫిట్ అందించింది. ఈ సినిమాతో టాలీవుడ్ బయ్యర్లు దాదాపు 8 కోట్ల వరకు షేర్ అందుకున్నట్లు సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.