Begin typing your search above and press return to search.

#2021 NYE .. `వకీల్ సాబ్` సంక్రాంతి గిఫ్ట్..!

By:  Tupaki Desk   |   1 Jan 2021 5:24 AM GMT
#2021 NYE .. `వకీల్ సాబ్` సంక్రాంతి గిఫ్ట్..!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు- బోని క‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా వ‌కీల్ సాబ్ బృందం అభిమానుల‌కు కానుక‌ను ప్ర‌క‌టించింది. మూవీ టీజర్ ‌ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నామ‌ని తెలిపారు. దీంతో పాటే నాయ‌కానాయిక‌ల బైక్ రైడ్ ఫోటోని రిలీజ్ చేయ‌గా అది అభిమానుల్లోకి వైర‌ల్ గా దూసుకెళ్లింది. ఈ పోస్ట‌ర్ చూస్తుంటే మ‌రోసారి భాగ్య‌ల‌క్ష్మితో గ‌బ్బ‌ర్ సింగ్ రొమాన్స్ వ‌ర్క‌వుట‌వుతుంద‌నే అంచ‌నాలేర్ప‌డ్డాయి. రాయ‌ల్ ఎన్ ఫీల్డ్ లేటెస్ట్ మోడ‌ల్ బుల్లెట్టుపై రొమాంటిగ్గా షికార్ కి బ‌య‌ల్దేరారు ప‌వ‌న్ - శ్రుతి జోడీ. మాతృకతో పోలిస్తే ప‌వ‌న్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టుగా క‌థ‌లో ల‌వ్ ఎలిమెంట్ ని జోడించ‌డం ఆస‌క్తిక‌రం.

ఈ చిత్రంలో నివేదా థామస్- అంజలి- అనన్య నాగల్ల ఇత‌ర‌ ప్రధాన పాత్రల‌లో నటించారు. అమీతాబ్ బచ్చన్ పింక్ మూవీకి అధికారిక రీమేక్ ఇది. ఎస్.ఎస్.థ‌మన్ సంగీతం అందిస్తున్నారు.