Begin typing your search above and press return to search.

2021 NYE గిఫ్ట్.. ల‌వ్ లీ ఫ్యాన్స్ కి డార్లింగ్ శుభాకాంక్ష‌ల‌తో..

By:  Tupaki Desk   |   1 Jan 2021 4:56 AM GMT
2021 NYE గిఫ్ట్.. ల‌వ్ లీ ఫ్యాన్స్ కి డార్లింగ్ శుభాకాంక్ష‌ల‌తో..
X
ప్ర‌భాస్ `రాధే శ్యామ్` కి సంబంధించిన‌ కొత్త అప్ ‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూశారు. డార్లింగ్ ప్ర‌భాస్ - రాధా కృష్ణ కుమార్- యువి బృందం నూత‌న సంవ‌త్స‌ర కానుక ఏదైనా ఇస్తారా? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చా గ‌త రెండు రోజులుగా సాగింది.

అయితే 2021 కొత్త సంవత్సరంలో `ప్రేమను శృంగారాన్ని` స్వాగతించమని అభిమానులను ఆటపట్టించిన ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ కుమార్ ఇంత‌కుముందు ఇన్ ‌స్టాగ్రామ్ ‌లో ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ప్ర‌భాస్ అభిమానుల కోసం షేర్ చేశారు. ఎట్ట‌కేల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో డార్లింగ్ ప్ర‌భాస్ పోస్ట‌ర్ ని చిత్ర‌బృందం రిలీజ్ చేసింది. ప్ర‌భాస్ సైతం స్వ‌యంగా ట్విట్ట‌ర్ ఇన్ స్టాలో కొత్త లుక్ ని విడుద‌ల చేయ‌గా అది ఫ్యాన్స్ లోకి సునామీ స్పీడ్ తో దూసుకెళ్లింది.

``నా ల‌వ్ లీ అభిమానులంద‌రికీ 2021 శుభాకాంక్ష‌లు. ఆరోగ్య‌క‌ర జీవ‌నంతో సంతోషంగా జీవించాల‌ని ఆకాంక్షిస్తున్నాను. నూత‌న‌సంవ‌త్స‌రం రెండు హృద‌యాల‌తో రాధే-శ్యామ్`` అంటూ ప్ర‌భాస్ విషెస్ తెలిపారు.

ప్ర‌స్తుతం ఈ మూవీ విడుదల తేదీని ఖరారు చేయడానికి ప్రభాస్ నిర్మాత‌ల‌ బృందంతో సమావేశమయ్యారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న రాధే శ్యామ్ విడుద‌ల తేదీపై సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే క్లారిటీ రావొచ్చ‌ని తెలుస్తోంది. బాహుబ‌లి-2 చిత్రం ఏప్రిల్ 28న‌ విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించింది. అదే తేదీని సెంటిమెంటుగా లాక్ చేసే వీలుంద‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి.

రాధేశ్యామ్ చిత్రం రిచ్ పూర్ ప్రేమ‌క‌థ‌తో ఆద్యంతం హృద‌యాన్ని ట‌చ్ చేసే ఎలిమెంట్స్ తో సాగుతుంద‌ని ఇప్ప‌టికే రివీలైంది. 1960ల‌లో యూరప్ నేపథ్యంలో సెట్ చేసిన పీరియడ్ లవ్ స్టోరీ. ప్రేరణ‌గా పూజా హెగ్డే న‌టిస్తోంది. రిచ్ గ‌య్ విక్రమాదిత్య పాత్ర‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్నారు. ఇటలీ నేప‌థ్యాన్ని పాక్షికంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ ‌సిటీలో నిర్మించిన పెద్ద సెట్ ‌లో చిత్రీకరించారు. పూజా కొద్ది రోజుల క్రితమే ఈ చిత్రం హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ప్ర‌భాస్ అక్టోబర్లో ఇటలీకి వెళ్లి 30 రోజుల షెడ్యూల్ ని పూర్తి చేసిన సంగ‌తి తెలిసిన‌దే.

ఓం రౌత్ తో ఆదిపురుష్ 3డి.. ప్రశాంత్ నీల్ తో `సలార్` చిత్రాల్ని ప్ర‌క‌టించిన ప్ర‌భాస్ వీటిని శ‌ర‌వేగంగా పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ సైన్స్ ఫిక్ష‌న్ సినిమాలోనూ న‌టించ‌నున్నాడు.