Begin typing your search above and press return to search.
టాప్ 10 లో తెలుగు.. తమిళ స్టార్స్ మాత్రమే
By: Tupaki Desk | 14 Dec 2021 6:00 AM ISTసోషల్ మీడియాలో స్టార్ హీరోల అభిమానులు ఈమద్య కాలంలో చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. నెట్టింట స్టార్ హీరోల బర్త్ డేలు లేదా వారి సినిమాలకు సంబంధించిన విషయాలు రెగ్యులర్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి. బాలీవుడ్ హీరోలను మించిన ఫాలోయింగ్ సోషల్ మీడియాలో సౌత్ స్టార్ కు ఉంది అనడంలో సందేహం లేదు.
హీరోలు అభిమానులు పోటీ పడి మరీ హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తూ ఉన్నారు. నెట్టింట పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్న మన స్టార్స్ ను ట్విట్టర్ ఇండియా గుర్తించింది. ప్రతి ఏడాది కూడా ఆ ఏడాది అత్యధికంగా ట్రెండ్ అయిన స్టార్ ను ట్విట్టర్ ప్రకటిస్తుంది. ఈ ఏడాదికి గాను టాప్ 10 స్టార్స్ ను ట్విట్టర్ అన్ని విభాగాల్లోనూ ప్రకటించింది.
2021 మోస్ట్ ట్విట్టెడ్ హీరోల జాబితాను ట్విట్టర్ విడుదల చేసింది. ఈ టాప్ 10 జాబితాలో తమిళ హీరోలు అయిదు మంది తెలుగు హీరోలు అయిదు మంది ఉన్నారు. ఇదే సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన కన్నడ మరియు మలయాళ స్టార్స్ కు ఈ జాబితాలో చోటు దక్కలేదు. నెం.1 స్థానంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ నిలిచాడు.
తమిళనాట విజయ్ అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆయన ఏ సినిమా విడుదల అయినా.. ఏ ప్రత్యేక సందర్బం అయినా కూడా పెద్ద ఎత్తున ట్రెండ్ చేసేందుకు అభిమానులు సిద్దంగా ఉంటారు. అందుకే ఈ ఏడాది సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో విజయ్ గురించి అత్యధికులు ట్వీట్స్ చేయడం జరిగింది.
నెం.2 లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆయన సినిమాల గురించి మరియు ఆయన రాజకీయ కార్యక్రమాల గురించి రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పవన్ గురించిన చర్చ జరుగుతుంది. అందుకే పవన్ కు నెం.2 దక్కింది. ఇక నెం.3 లో మహేష్ బాబు ఉన్నాడు. నెం.4 లో సూర్య మరియు నెం.5 లో ఎన్టీఆర్ లు ఉన్నారు.
నెం.6 లో అల్లు అర్జున్ ఉండగా ఆ తర్వాత స్థానంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఉన్నారు. నెం.8 లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉండగా నెం.9 లో ధనుష్ ఉన్నాడు. ఇక నెం.10 లో తమిళ స్టార్ హీరో అజిత్ ఉన్నాడు. ట్విట్టర్ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ జాబితాను కూడా విడుదల చేసింది. అందులో నెం.1 లో కీర్తి సురేష్ నిలువగా నెం.2 లో మాత్రం పూజా హెగ్డే నిలిచింది.