Begin typing your search above and press return to search.

బిజినెస్ పరంగా 2021 టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్లస్ కాబోతుందా..?

By:  Tupaki Desk   |   23 Dec 2020 7:30 AM GMT
బిజినెస్ పరంగా 2021 టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్లస్ కాబోతుందా..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో 2021 ఏడాది అంతా బడా హీరోల భారీ సినిమాలన్నీ సందడి చేయనున్నాయి. బడా హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా అందరి సినిమాలు సినీ ప్రేక్షకులకు కనువిందు కలిగించనున్నాయి. కరోనా కారణంగా ఈ ఏడాది మొత్తం ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేకపోవడంతో సెలబ్రిటీలు, ప్రేక్షకులు, అభిమానులు చాలా బోర్ గా ఫీలయ్యారు. అయితే వీళ్లందరికి 2021 చాలా టైం ఇవ్వబోతుంది. ఇప్పటి వరకు విడుదల కాకుండా ఆగిన సినిమాలు, షూటింగ్ మధ్యలో నిలిచిన వాటితో పాటు విడుదలకు రెడీ అవుతున్న చిన్న, మీడియం, పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే టైటిల్స్, మోషన్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అంటూ క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు వచ్చే ఏడాది పూర్తయ్యేలోపు థియేటర్లకు చేరుతాయేమో చూడాలి.

మెగాస్టార్ ఆచార్య సినిమా మొదలుకొని బాలయ్య - బోయపాటిల బిబి3, సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట', ప్రభాస్ నటిస్తున్న 'రాధేశ్యామ్', అల్లు అర్జున్ - సుకుమార్ ల పుష్ప, పవర్ స్టార్ వకీల్ సాబ్, రాజమౌళి - రాంచరణ్ - ఎన్టీఆర్ ల కాంబినేషన్లో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, వెంకటేష్ నారప్ప, రానా అరణ్య, విరాటపర్వం, రవితేజ 'క్రాక్'.. ఇలా అందరి సినిమాలు తమ అభిమానులను పలకరించి బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇవన్నీ విడుదలై సరిగ్గా కాసుల వర్షం కురిపిస్తే మాత్రం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో 1000 కోట్ల పైగా బిజినెస్ జరగడం ఖాయమే అంటున్నాయి సినీవర్గాలు. అభిమానులలో మాత్రం వారి హీరోల సినిమాల పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. చూడాలి మరి ఏ హీరో సినిమా.. ఎంతెంత వసూళ్లు రాబడుతుందో..!!