Begin typing your search above and press return to search.

2020 రివైండ్: నిర్మాత‌లు కోలుకోవ‌డం అంత సులువేం కాదు!

By:  Tupaki Desk   |   31 Dec 2020 11:14 AM IST
2020 రివైండ్: నిర్మాత‌లు కోలుకోవ‌డం అంత సులువేం కాదు!
X
2020 సంక్రాంతికి అల వైకుంఠ‌పుర‌ములో .. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాలు థియేట‌ర్ల‌లో స‌జావుగా రిలీజై మంచి ఫ‌లితాన్ని అందుకున్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించ‌డంతో నిర్మాత‌లు హ్యాపీ అయ్యారు. ఆ సినిమాల్ని రిలీజ్ చేసిన పంపిణీదారులు స‌హా మార్కెట్ వ‌ర్గాల‌న్నీ సంతోషక‌ర రిజ‌ల్ట్ నే అందుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

2020 తెలుగు సినిమాకు బాగా క‌లిసొస్తుంద‌ని ఆశ‌లు పెంచింది సంక్రాంతి రిజ‌ల్ట్. ఆ తరువాత వరుస ఫ్లాప్ ‌లు ఇబ్బందిపెట్టినా.. భీష్మ - హిట్ చిత్రాలు ఫిబ్రవరిలో రిలీజై విజ‌యాలు అందుకున్నాయి. బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని ఫ‌లితాన్ని అందుకున్నాయి ఈ సినిమాలు.

ఆ త‌ర్వాత సీన్ మొత్తం మారిపోయింది. క‌రోనా మ‌హ‌మ్మారీ చైనా నుంచి అన్ని దేశాల‌కు పాకి.. ఇండియాలోనూ విజృంభించ‌డం మొద‌లు పెట్టాక స‌న్నివేశం ఒక్క‌సారిగా దిగ‌జారిపోయింది. మార్చి నుంచి థియేటర్లు మూసేశారు. అన్ని చిత్రాల షూటింగ్ లు నిలిపేసారు. 2020 ఎండ్ వ‌ర‌కూ టాలీవుడ్ విలువైన స‌మ‌యం పూర్తిగా వృధా అయ్యింది.

ఎంతో హోప్ పెంచిన సినిమాలేవీ రిలీజ్ కాలేదు. సినిమా విడుదలలు ఆలస్యం కావడంతో నిర్మాతలు భారీగా ఆర్థిక ఒత్తిడికి గురవ్వ‌డం మొద‌లైంది. ఈ ప్ర‌భావం నిర్మాత‌లే కాకుండా అంద‌రిపైనా ప‌డింది. ఇలాంటి క్రైసిస్ లోనూ హీరోలు హీరోయిన్లు స‌హా చాలా మంది నటులు నటీమణులు తమ చెల్లింపులను తగ్గించలేదు. ఎగ్జిబిషన్ పరిశ్రమ పూర్తిగా విచ్ఛిన్నమైంది. వారు తిరిగి ట్రాక్ ‌కి రావడానికి సంవత్సరాలు పడుతుంది. కొంతమంది చిత్రనిర్మాతలు తమ సినిమాలను విడుదల చేయడానికి ప్ర‌య‌త్నిస్తున్నా మ‌రి కొన్ని నెలల పాటు పంపిణీదారుల నుండి మద్దతు ఉంటుందా అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. చాలావరకు రిస్క్ పూర్తిగా నిర్మాత‌ల‌పైనే ఉంటుంది. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న‌వి.. రిలీజ్ కి వ‌స్తున్న‌వి 100పైగానే ఉంటాయి. ఈ సినిమాల‌కు 2021 కూడా గ‌డ్డు కాల‌మేన‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.

అయితే అగ్ర హీరోలు న‌టించే సినిమాల‌కు జ‌నంలో హైప్ ఉంటుంది కాబ‌ట్టి కోవిడ్ నిబంధ‌న‌ల్ని అనుస‌రించి 50శాతం వీక్ష‌ణ‌తో రిలీజ్ చేసినా సుదీర్ఘ కాలంలో రిట‌ర్నులు సాధ్య‌మ‌వుతుందేమో. కానీ అసాధార‌ణ లాభాలు రావ‌డం అన్న‌ది క‌ల్ల‌గా మారుతుంది. ఒక‌వేళ క‌రోనాకి వ్యాక్సిన్ (టీకా) పూర్తి స్థాయిలో అందుబాటులోకి వ‌చ్చేస్తే జ‌నంలో ధైర్యం థియేట‌ర్ల‌కు ర‌ప్పిస్తుంద‌నే భావిద్దాం. అన్ని క్రైసిస్ ల‌కు చెక్ పెట్టేది ప్ర‌జ‌ల సంపూర్ణ సుర‌క్షిత ఆరోగ్యం మాత్ర‌మేన‌ని గుణ‌పాఠం నేర్చుకున్నాం.