Begin typing your search above and press return to search.

టాప్‌ 5 లో నాలుగు మెగా పాటలే

By:  Tupaki Desk   |   6 Dec 2020 12:30 AM GMT
టాప్‌ 5 లో నాలుగు మెగా పాటలే
X
కరోనా కారణంగా 2020 సంవత్సరం ఎప్పుడెప్పుడు పూర్తి అవుతుందా అంటూ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మొదటి రెండు నెలలు మాత్రమే సినిమాలు వచ్చాయి. సినిమాల రికార్డులు ఈ ఏడాది పెద్దగా కనిపించలేదు. కాని అంతకు ముందు వచ్చిన పాటలు రికార్డులు మాత్రం మారుమ్రోగుతూ వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా వచ్చిన అల వైకుంఠపురంలోని మూడు పాటలు ఈ ఏడాది ది బెస్ట్ సాంగ్స్‌ గా నిలిచాయి. అద్బుతమైన వ్యూస్‌ ను రాబట్టి ఈ ఏడాదిలోనే కాకుండా ఆల్‌ టైమ్‌ రికార్డు గా నిలిచాయి. 2020లో వచ్చిన పాటల్లో అత్యధిక వ్యూస్‌ దక్కించుకున్న అయిదు పాటల జాబితాలో నాలుగు మెగా హీరోల పాటలు ఉన్నాయి అంటే ఈ ఏడాది మెగా జోరు యూట్యూబ్‌ లో ఎంతగా నడిచిందో అర్థం చేసుకోవచ్చు.

నెం.1 గా ఎలాంటి డౌట్‌ లేకుండా బుట్టబొమ్మ సాంగ్‌ నిలిచింది. ఆ పాటకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. యూట్యూబ్‌ యూనివర్శ్‌ రికార్డ్‌ ను కూడా ఈ పాట దక్కించుకుంది. ఇక నెం.2 గా అల వైకుంఠపురంలో సినిమాకే చెందిన రాములో రాములా పాట నిలిచింది. యూట్యూబ్‌ లో ఈ పాట కూడా మిలియన్‌ లకు మిలియన్‌ ల వ్యూస్‌ దక్కించుకోవడంతో పాటు ఎక్కడ చూసినా కూడా ఇదే వినిపించింది. ఇక నెం.3గా ప్రదీప్‌ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలోని నీలి నీలి ఆకాశం.. పాట నిలిచింది. ఈ పాటతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి అంటే యూట్యూబ్‌ లో ఈ పాటకు దక్కిన ఆధరణ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

నెం.4గా మళ్లీ ఉప్పెన సినిమా పాట నిలిచింది. నీ కన్ను నీలి సముద్రం పాటతో ఉప్పెన స్థాయి కూడా అమాంతం పెరిగింది. నీలి నీలి ఆకాశం మరియు నీ కన్ను నీలి సముద్రం పాటలు హోరా హోరీగా ఒకానొక సమయంలో శ్రోతలను ఆకట్టుకున్నాయి. నెం.5గా మళ్లీ అల వైకుంఠపురంలోని సామజవరగమన.. పాట నిలిచింది. ఈ పాటకు ఎన్ని కవర్‌ సాంగ్స్‌ వచ్చాయో చెప్పలేం. వాటికి కూడా మిలియన్స్‌ వ్యూస్‌ వచ్చాయి. మొత్తానికి ఈ ఏడాది టాప్‌ 5 పాటల్లో మూడు బన్నీ పాటలు కాగా, ఒకటి వైష్ణవ్‌ తేజ్‌ పాట. ఈ అయిదు పాటల తర్వాత ఆరవ స్థానంలో భీష్మలోని వాట్టే వాట్టే బ్యూటీ... ఏడవ స్థానంలో పలాస సినిమాలోని నక్కిలీసు గొలుసు... ఎనిమిదవ స్థానంలో జాను లోని లైఫ్‌ ఆఫ్‌ రామ్‌ .. తొమ్మిదవ స్థానంలో సవారిలోని ఉండిపోవా నువ్విలా.. పదవ స్థానంలో అనూహ్యంగా కన్నడ మూవీ పొగరు కరాబు మైండ్‌ కరాబు పాట నిలిచింది.