Begin typing your search above and press return to search.

క్లారిటీ మిస్ అవుతున్న సంక్రాంతి పుంజులు

By:  Tupaki Desk   |   3 April 2019 8:00 PM IST
క్లారిటీ మిస్ అవుతున్న సంక్రాంతి పుంజులు
X
ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ వచ్చే ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో నిలవబోయే సంక్రాంతి పుంజులపై అప్పుడే రకరకాల కథనాలు మొదలైపోయాయి. అసలు ఎవరుంటారు ఎవరు తప్పుకుంటారు అనే విషయంలో క్లారిటీ లేకపోయినప్పటికీ మా హీరోది వస్తుంది అంటూ ఎవరి అభిమానులు వాళ్ళు ధీమాగా ఉన్నారు.

మహర్షి షూటింగ్ లో ఉండగానే మహేష్ బాబు అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఖచ్చితంగా చెప్పిన టైంకి మహేష్ మూవీస్ చాలా అరుదుగా విడుదలవుతాయి. దిల్ రాజు నిర్మాణమైనా దానికి గ్యారెంటీ లేదు. మహర్షిలో ఆయన్న పార్టనర్ గా ఉన్నా మూడు డేట్లు మారింది. గతంలో ఎవడు ఏకంగా నెలలు తేడాతో లేట్ అయ్యింది. సో అనిల్ రావిపూడిది ప్రస్తుతానికి సంక్రాంతి అంటున్నారు కానీ ఇప్పటికి ఏమి చెప్పలేం.

ఇక ప్రభాస్ రాధాకృష్ణ కాంబోలో రూపొందుతున్న యూరోప్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ వచ్చే ఏడాది వస్తుందని దర్శకుడు ట్వీట్ చేశాడు కానీ సంక్రాంతి అనే మాట అనలేదు. పైగా సాహో వచ్చిన ఐదు నెలలకే ప్రభాస్ మరో సినిమా వస్తుంది అంటే అభిమానులే నమ్మరు.

ఇక బాలకృష్ణ బోయపాటి శీనుల మూవీ కూడా రేస్ లో ఉంటుందని మరో టాక్. బాలయ్య ఇప్పుడా సెంటిమెంట్ లేదు. ఎన్టీఆర్ కథానాయకుడు ఆ నమ్మకం దారుణంగా దెబ్బ తీసింది. ఆ సమయానికి చిత్రం పూర్తయ్యిందా సరే లేదంటే మొహమాటం లేకుండా లేట్ గానో త్వరగా పూర్తయితే ముందుగానో వచ్చినా ఆశ్చర్యం లేదు.

ఇవన్నీ ఓక ఎత్తు అయితే సైరాను ఇక్కడ మర్చిపోకూడదు. చరణ్ దసరా అంటున్నాడు కానీ ఒకవేళ ఏదో కారణాల వల్ల వాయిదా పడితే సంక్రాంతి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అదే జరిగితే పోటీ సమస్య జటిలం అవుతుంది. అసలు ఇక్కడ చెప్పిన ఏ సినిమా దర్శక నిర్మాతలు ఖచ్చితంగా 2020 సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలుగానే తీసుకోవాలి