Begin typing your search above and press return to search.

2020 రివ్యూ: డెడ్లీ డిజాస్ట‌ర్ల‌తో ఆ న‌లుగురు

By:  Tupaki Desk   |   28 Dec 2020 11:00 PM IST
2020 రివ్యూ: డెడ్లీ డిజాస్ట‌ర్ల‌తో ఆ న‌లుగురు
X
2020 ముగించి 2021కి వెల్ కం చెప్పేందుకు ప్ర‌పంచం సిద్ధ‌మ‌వుతోంది. కొత్త సంవ‌త్స‌రం అయినా కొంగొత్త ఆశల‌తో పాజిటివిటీని నింపుతుంద‌నేది ఆశ‌. మ‌హ‌మ్మారీ భ‌యాల న‌డుమ సినీప‌రిశ్ర‌మ‌లో నిరంత‌రం ఇదే చ‌ర్చ సాగుతోంది. ఇక ఈ ఏడాది హిట్ల సంగ‌తేమో కానీ ఫ్లాపుల గురించి వెతికితే ఓ నాలుగు సినిమాలు క్రేజీగా డిజాస్ట‌ర్ల జాబితాలో చేరాయి.

మాస్ మ‌హారాజా రవితేజా న‌టించిన డిస్కో రాజా 24 జ‌న‌వ‌రి 2020 న రిలీజై డిజాస్ట‌‌రైంది. అప్ప‌టికే రాజా కెరీర్ గ్రాఫ్ కొంతకాలంగా దిగజారి ఉండ‌డంతో డిస్కో రాజా వైఫ‌ల్యం బాధించింది. ఈ చిత్రంపై పాజిటివ్ అంచ‌నాల న‌డుమ‌ ఆరంభం నుంచే ఆశాజనకంగా అనిపించినా.. వి.ఆనంద్ రాసిన పేలవమైన స్క్రిప్ట్ కారణంగా పెద్ద ఫ్లాపైంది. సంక్రాంతి పోటీని వ‌దిలేసినా ఆ త‌ర్వాత వ‌చ్చినా ప‌రాజ‌యాన్ని ఆప‌లేక‌పోయారు.

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ కెరీర్ లో మ‌రో ఫ్లాప్ గా నిలిచింది `ఎంత మంచివాడ‌వురా`. ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ మూవీ హిట్టవుతుంద‌ని కళ్యాణ్ రామ్ భావించినా బాక్సాఫీస్ ఫ‌లితం ఇంకేదో అయ్యింది. సంక్రాంతికి రిలీజై పెద్ద సినిమాల న‌డుమ డిపాజిట్లు కోల్పోయింది. ద‌ర్శ‌కుడు వేగెష్న‌ సతీష్ కి ఇది చెడ్డ పేరు తెచ్చింది.

మ‌రో అర్జున్ రెడ్డి రేంజు అంటూ ప్ర‌చారం సాగినా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ప‌రిస్థితి డిజాస్ట‌ర్ గానే మారింది. భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజైన దేవ‌ర‌కొండ మూవీ ప్రేక్షకులకు అభిమానులకు బాధాకరమైన అనుభవంగా మారింది. ఈ మూవీ వ‌ల్ల విజ‌య్ గ్రాఫ్ త‌గ్గ‌క‌పోయినా కానీ కెరీర్ లో ఒకానొక బ్యాడ్ ఎక్స్ పీరియెన్స్ అన‌డంలో సందేహ‌మేం లేదు. నిర్మాత‌ల‌కు పంపిణీదారుల‌కు పీడ‌క‌ల‌ల్ని మిగిల్చిన చిత్రంగానూ చెప్పుకున్నారు. మ‌ళ్లి మ‌ళ్లి ఇది రాని రోజు లాంటి ఆక‌ట్టుకునే రొమాంటిక్ డ్రామా చేసిన క్రాంతి మాధవ్ ఈ చిత్రంలోని ప్రతి అంశంలో విఫలమయ్యారన్న విమ‌ర్శ‌లొచ్చాయి.

భారీ అంచ‌నాల న‌డుమ రిలీజైన శ‌ర్వానంద్-స‌మంత ల `జాను` అంతే నిరాశ‌ప‌రిచింది. ఒరిజిన‌ల్ త‌మిళ హిట్ చిత్రంలా మాయాజాలం పునఃసృష్టించాల‌ని భావించినా అది అన్నివిధాలా ఫెయిలైంద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. శర్వానంద్- సమంత బెస్ట్ గా న‌టించినా దిల్ రాజు టీమ్ అంచ‌నాలు తారుమార‌య్యాయి. త‌మిళంలో 96 పేరుతో తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గానే గాక అవార్డులు రివార్డులు కొల్ల‌గొట్టింది. సేతుప‌తి- త్రిష జంట‌కు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యంగా నిలిచింది. కానీ తెలుగులో జాను అంద‌రికీ బ్యాడ్ నేమ్ తెచ్చింది.