Begin typing your search above and press return to search.

2020: పెద్ద స్టార్ హీరో ల సినిమాలు తక్కువే!

By:  Tupaki Desk   |   24 Dec 2019 10:06 AM GMT
2020: పెద్ద స్టార్ హీరో ల సినిమాలు తక్కువే!
X
మరో వారం రోజుల లో 2019 మనకు గుడ్ బై చెప్పేస్తుంది.. కొత్త సంవత్సరం 2020 మనకు హాయ్ చెప్తుంది. టాలీవుడ్ విషయమే తీసుకుంటే వచ్చే ఏడాది స్టార్ హీరోల సినిమాలు చాలా తక్కువ మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు.. థియేటర్ ఓనర్లు కొంత అందోళన గా ఉన్నారట. అలా ఎందుకు అంటే బాక్స్ ఆఫీస్ కళకళలాడాలంటే స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రిలీజ్ కావాలి. ఒక పెద్ద సినిమా హిట్ అయితే అది పది చిన్న సినిమాల కలెక్షన్ల కు సమానం.

ఈమధ్య చిన్న సినిమాలను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు రావడం చాలా తగ్గింది. అమెజాన్.. హాట్ స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ప్రభావం కారణంగా ప్రేక్షకులు చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదు. అద్భుతం అనే టాక్ వస్తే తప్ప చిన్న సినిమాల కోసం థియేటర్లకు వెళ్ళడం లేదు. దీంతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. అందుకే పెద్ద స్టార్ హీరోల సినిమాలు తరచుగా వస్తేనే ఈ సమస్యకు కొంతవరకూ పరిష్కారం దొరుకుతుంది.

సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు మిన హాయిస్తే స్టార్ హీరోల సినిమాలు పక్కాగా రిలీజ్ అయ్యేవి చాలా తక్కువ. 'RRR' వచ్చే ఏడాది జులైలో రిలీజ్ అని ప్రకటించారు. ప్రభాస్ నటించే సినిమా పరిస్థితి ఇంకా తెలియదు. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఇంకా ఫైనలైజ్ కాదు. అల్లు అర్జున్ #AA20 రిలీజ్ గురించి కూడా ఇంకా క్లారిటీ లేదు. చిరంజీవి-కొరటాల సినిమా రిలీజ్ ఎప్పుడో ఫైనలైజ్ కావల్సి ఉంది. ఈలెక్కన వచ్చే ఏడాది ఎక్కువగా మిడ్ రేంజ్ హీరోల సినిమాల హవానే ఉంటుంది. ఈలెక్కన వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ ను ఏ మిడ్ రేంజ్ హీరోలు ఆదుకుంటారో వేచి చూడాలి.