Begin typing your search above and press return to search.

2019 తార‌ల ప్రేమాయ‌ణాలు పెళ్లిళ్లు

By:  Tupaki Desk   |   27 Dec 2019 11:08 AM IST
2019 తార‌ల ప్రేమాయ‌ణాలు పెళ్లిళ్లు
X
సినీ సెల‌బ్రిటీ ల పెళ్లిళ్లు.. ప్రేమాయ‌ణాలు.. బ్రేక‌ప్‌లు ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మే. తార‌ల ప్రేమ వ్య‌వ‌హారాల‌న్నా.. ప్రేమ పెళ్ళిళ్ల‌న్నా బ్రేక‌ప్ లైనా ప్ర‌తి ఒక్క‌రికీ ఆస‌క్తే. ఎవ‌రు ఎవ‌రిని పెళ్లాడ‌బోతున్నారు?. ఏ హీరోయిన్ ఎవ‌రితో డేటింగ్ చేస్తోంది?. ఎవ‌రిని పెళ్లాడ‌బోతోంది. ఎవ‌రెవ‌రు బ్రేక‌ప్ కి రెడీ? ఏ ప్రేమ జ‌ట పెళ్లిదాకా వెళుతోంది.. ఇలాంటి వార్త‌లు ఈ ఏడాది చాలానే మీడియా కెక్కాయి. 2019లో ప్రేమ పెళ్లిళ్లూ వున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట‌లు విడిపోయిన సంఘ‌ట‌న‌లూ వున్నాయి.

న‌టిగా కెరీర్ ప‌రంగా చెప్పుకోద‌గ్గ అవ‌కాశాలు త‌గ్గిన‌ అర్చ‌న ఇటీవ‌ల త‌న స్నేహితుడు.. ప్రియుడు జ‌గ‌దీష్ ని పెళ్లాడింది. జ‌గ‌దీష్ ప్ర‌ముఖ వ్యాపార వేత్త‌. చాలా కాలంగా ప్రేమ‌లో వున్న ఈ జంట ఇరు కుటుంబాలు వీరి ప్రేమ‌ను అంగీక‌రించ‌డంతో న‌వంబ‌ర్ 14న వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. కోలీవుడ్ లో సైలెంట్ గా తెర‌పైకొచ్చి షాకిచ్చిన జంట ఆర్య‌- స‌యేషాసైగ‌ల్‌. గ‌త కొంత కాలంగా సీక్రెట్ గా ప్రేమ‌లో వున్న ఈ జంట అనూహ్యంగా పెళ్లి పీట‌లెక్క‌డం కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ స్టార్ల‌ నీ విస్మ‌యానికి గురిచేసింది. హైద‌రాబాద్ ఫ‌ల‌క్‌ నూమా ప్యాలెస్‌ లో వీరి వివాహం జ‌రిగింది. కోలీవుడ్‌- టాలీవుడ్‌, బాలీవుడ్ కు చెందిన తార‌లు ఈ వివాహ వేడుక‌ లో పాల్గొన్నారు.

లీడ‌ర్‌-మిర‌ప‌కాయ్‌- మిర్చి చిత్రాల హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ‌దీ ప్రేమ వివాహ‌మే. నాగార్జున‌ తో న‌టించిన సినిమా త‌రువాత టాలీవుడ్ కు టాటా చెప్పేసిన ఈ ఎన్నారై చిన్న‌ది త‌న క్లాస్ మేట్ జోని ప్రేమించి పెళ్లాడింది. మూడు నెల‌ల క్రిత‌మే వీరి వివాహం జ‌రిగింది. అయితే త‌న వివాహాన్ని బ‌య‌టికి రానివ్వ‌కుండా జాగ్ర‌త్త‌ ప‌డిన రిచా ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకుంద‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో తాజాగా వివ‌ర‌ణ ఇచ్చింది. త‌నది ర‌హ‌స్య వివాహం కాద‌ని పెద్ధ‌ల అంగీకారం తోనే జ‌రిగింద‌ని క్లారిటీ ఇచ్చింది. ఫ్యాష‌న్‌ డిజైన‌ర్‌, ఎంఎల్ ఏ వంటి చిత్రాల్లో న‌టించిన మ‌నాలి రాథోడ్ వివాహం న‌వంబ‌ర్ 29న వ్యాపార వేత్త ర‌వి విజ్జ‌త్ తో జ‌రిగింది.

ఇదే సంవ‌త్స‌రం యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీ‌ప్ర‌సాద్ సోద‌రుడు.. గాయ‌కుడు సాగ‌ర్ వివాహం జ‌రిగింది. మౌనిక అనే యువ‌తి ని పెళ్లాడారు. ఇది పెద్ద‌లు కుదిర్చిన వివాహ‌మే. ఈ పెళ్లికి టాలీవుడ్ కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. అల్లు అర్జున్ అన్న‌య్య అల్లు వెంక‌టేష్ త‌న మొద‌టి భార్య‌ కు విడాకులిచ్చి ముంబై ఫ్యాష‌న్ డిజైన‌ర్ నీలూ షాని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి అల్లు కుటుంబ స‌భ్యుల‌ తో పాటు నీలు కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే పాల్గొన్నారు. ఇదే ఏడాది సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిన్న‌కూతురు సౌంద‌ర్య రెండో వివాహం చేసుకున్నారు.