Begin typing your search above and press return to search.

2019 రిపోర్ట్‌: వివాదం కేరాఫ్ టాలీవుడ్

By:  Tupaki Desk   |   28 Dec 2019 4:32 AM GMT
2019 రిపోర్ట్‌: వివాదం కేరాఫ్ టాలీవుడ్
X
వ‌ర్మ తీసిన మ‌రో వివాదాస్ప‌ద చిత్రం `అమ్మ రాజ్యం లో క‌డ‌ప బిడ్డ‌లు`. ఈ సినిమా టైటిల్ నుంచే వివాదాల‌ కు తెర తీసింది. క‌మ్మ రాజ్యంల క‌డ‌ప బిడ్డ‌లు అంటూ క‌మ్మ‌- రెడ్డి రాజ‌కీయాల‌ పై సెటైర్ వేసే ప్ర‌య‌త్నం చేయ‌డం.. రాజ‌కీయం గా కొన్ని పార్టీల‌ నాయ‌కుల్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కావ‌డం తో దీని రిలీజ్ కోసం వ‌ర్మ ట్రిబ్యున‌ల్ వ‌ర‌కు వెళ్లి సెన్సార్ కోసం ఫైట్ చేయాల్సి వ‌చ్చింది. డిసెంబ‌ర్ 12న వ‌చ్చిన ఈ చిత్రం ఏపీ రాజ‌కీయాల‌పై వ్యంగ్యాస్త్రం అని తేలింది. వ‌రుణ్‌తేజ్ న‌టించిన `వాల్మీకి` టైటిల్ కార‌ణంగా వివాదంలో చిక్కుకుంది. ఓ వ‌ర్గం వారిని కించ‌ప‌రిచేలా ఈ సినిమా టైటిల్‌ వుంద‌ని టైటిల్ ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మార్చాలంటే హైకోర్టు ని బోయ వాల్మీకి సామాజిక వ‌ర్గం ఆశ్ర‌యించ‌డం వివాదాస్ప‌దం గా మారింది. దీంతో `వాల్మీకి` కాస్త `గ‌ద్ద‌ల‌ కొండ గ‌ణేష్‌`గా మారింది.

ఈ ఏడాది చివ‌ర‌ లో వ‌చ్చిన చిత్రం `జార్జి రెడ్డి`. 1970లో ఉస్మానియా లో రాజ‌కీయాల‌కు అతీతం గా విద్యార్థి ఉద్య‌మాన్నిన‌డిపిన స్టూడెంట్ లీడ‌ర్ జార్జి రెడ్డి. ఆయ‌న జీవితం ఆధారంగా ఈ మూవీని తెర‌ పైకి తీసుకొచ్చారు. నాటి విద్యార్థి రాజ‌కీయాల్నిప్ర‌భావితం చేసిన జార్జిరెడ్డి ని ఉస్మానియా క్యాంప‌స్ లోని ఇంజినీరింగ్ క‌ళాశాల ప్రాంగ‌ణంలోనే ప్ర‌త్య‌ర్థులు దారుణంగా హ‌త్య చేశారు. ఈ సినిమాని తెర‌కెక్కించే క్ర‌మం లో ఏబీవీపీ నాయ‌కులు త‌మ‌ని ఎక్క‌డ త‌క్కువ చేసి చూపిస్తారోన‌ని ఆందోళ‌న‌కు దిగ‌డంతో వివాదం రాజుకుంది. వివాదం స‌మ‌సి పోవ‌డం తో న‌వంబ‌ర్ 22న చిత్రాన్ని రిలీజ్ చేశారు.

ఈ ఏడాది సినిమాల‌ తో పాటు మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) వివాదం కూడా ర‌చ్చ‌కెక్కింది. నూత‌నంగా ఎన్నికైన న‌రేష్ ఎవ‌రినీ మాట్లాడ‌నివ్వ‌క‌ పోవ‌డం తో జీవిత‌- రాజ‌శేఖ‌ర్ ఇత‌ర టీమ్ మీడియా సాక్షిగా న‌రేష్ పై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశాడు. ఆ త‌రువాత నుంచి ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు తారా స్థాయి కి చేరాయి. ఎన్నిక‌ల వేళ న‌రేష్ - శివాజీ రాజా మ‌ధ్య వార్ గురించి తెలిసిందే. ఇప్ప‌టికీ మా వివాదాలు స‌ద్ధు మ‌ణ‌గ‌క పోవ‌డం తో పెద్ద‌లు త‌ల‌దూర్చాల్సి వ‌చ్చింది. ఇలా వ‌రుస‌ వివాదాల‌తో ఈ ఏడాది ఇలా గ‌డిచి పోయింది. ఇవే గాక ఇటీవ‌లే ఓ డీ- కంపెనీ నిర్మాత‌ను పోలీసులు ర‌క‌ర‌కాల కేసుల్లో అరెస్ట్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఇంత‌కుముందు ఎర్ర‌చంద‌నం వ్యాపారుల‌తో సంబంధం ఉన్న ఒక క‌థానాయిక‌పైనా పోలీస్ ఇన్వెస్టిగేష‌న్ సాగింది. న‌వంబ‌ర్ లో యాంగ్రీ హీరో రాజ‌శేఖ‌ర్ ఔట‌ర్ లో యాక్సిడెంట్.. అంత‌కు ముందు యువ‌ హీరో రాజ్ త‌రుణ్ యాక్సిడెంట్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.