Begin typing your search above and press return to search.

2018 ట్రైలర్: టాలీవుడ్ కు రాబోతున్న కేరళ జల ప్రళయం..!

By:  Tupaki Desk   |   22 May 2023 7:21 PM IST
2018 ట్రైలర్: టాలీవుడ్ కు రాబోతున్న కేరళ జల ప్రళయం..!
X
ఈ ఏడాది మలయాళంలో వచ్చి బాక్సాఫీసును షేక్ చేసిన "2018" సినిమా హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. కేవలం 13 రోజుల్లోనే 115 కోట్లకు పైగా కలెక్షన్లను రాబ్టటి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఇదే సినిమాను తెలుగులోనూ విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది. మే 26వ తేదీన టాలీవుడ్ లో 2018 అనే పేరుతో ఈ చిత్రం ప్రభంజనం సృష్టించబోతోంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు విడుదల చేసిందీ చిత్రబృందం. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇడుక్కి డ్యామ్ ఓపెన్ చేయడంతో వరదల కారణంగా కొందరి జీవితాలు ఎలా అతలాకుతలం అయ్యాయనే పాయింట్ తో ఈ చిత్రం ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. ఇందులో మిలట్రీ నుంచి భయంతో బయటకు వచ్చిన వ్యక్తిగా టోవినో థామస్ కనిపిస్తున్నాడు.

తన భార్యతో సమస్యలు ఉన్న వ్యక్తిగా వినీత్ శ్రీనివాసన్ నటించగా.. అపర్ణ బాల మురళి కూడా నటించబోతున్నారు. ఆసిఫ్ అలీ, లాల్ తన్వి రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

వరద ముప్పు నుంచి ప్రాణాలతో కొందరు ఎలాంటి పోరాటం సాగించారు, వరదల కారణంంగా తాగడానికి నీరు కూడా లేకుండా ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది ట్రైలర్ లో ఎమోషనల్ గా చూపించారు.

వరదల కారణంగా ఇళ్లు మొత్తం కొట్టుకుపోయి కేవలం శిథిలాలు మాత్రమే మిగిలే సీన్ తో ట్రైలర్ ను ముగించారు. రోజూ చూసే సముద్రపు నీళ్ల కంటే ఇదేమీ ప్రమాదకరం కాదయ్యా అంటూ చెప్పే డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. భయం, హ్యుమానిటీ, హోప్, ఇన్సిపిరేషన్.. ఇలా అన్ని ఎమోషన్లను ఈ సినిమాలో చూడవచ్చు. అలాగే ట్రైలర్ లో కూడా ఇందుకు సంబంధించిన అన్ని భావాలు కనిపించాయి.

ట్రైలర్ తోనే సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేస్తోందీ చిత్రం. తెలుగుతో పాటు తమిళ భాషలో ఈ సినిమా శుక్రవారం విడుదల కాబోతుంది. అలాగే హిందీ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఆ భాషల్లో ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.