Begin typing your search above and press return to search.
2018... ఇలాంటి సినిమాలే మాకు కావాలి
By: Tupaki Desk | 10 May 2023 1:30 PM ISTమలయాళ సినీ పరిశ్రమ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. కరోనా నేపథ్యంలో ఇతర సినిమా ఇండస్ట్రీ మాదిరిగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న మలయాళ సినీ ఇండస్ట్రీకి అనూహ్యంగా '2018' అనే సినిమాతో కాస్త బూస్టింగ్ దక్కినట్లు అయ్యింది. కంటెంట్ సినిమాలకు మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతారని మరోసారి నిరూపితం అయ్యింది.
మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన '2018' చిత్రం మొత్తం కూడా తుఫాన్ మరియు తుఫాన్ వల్ల ఏర్పడిన వరదలు ఇతర పరిస్థితుల గురించి చూపించడం జరిగింది. ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కేరళ రాష్ట్రాన్ని తీవ్రంగా నష్టపర్చిన 2018 తుఫాన్ తాలూకు సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగింది.
అరివిక్కులం అనే గ్రామం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఆర్మీ నుండి బయటకు వచ్చిన టోవినో థామస్ ఎప్పుడు కూడా రాజకీయాలు మరియు గొడవలతో సమయం గడుపుతూ ఉంటాడు. అలాంటి సమయంలో భారీ వర్షాల కారణంగా అందరూ నిరాశ్రయులు అవుతారు. ఇళ్ల విషయం పక్కన పెడితే కనీసం బతికేందుకే పోరాటం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
ఆ వరదల నుంచి జనాలు ఎలా బయట పడ్డారు.. ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి ఏంటి అనేది ఈ సినిమా కథ గా దర్శకుడు ఆంటోని జోసెఫ్ చూపించాడు. మనసుకు హత్తుకునే సన్నివేశాలు చాలానే ఈ సినిమాలో ఉన్నాయి. ఇక ఈ సినిమా మూడు రోజుల్లోనే పది కోట్ల వసూళ్లను రాబట్టింది. కేరళ రాష్ట్రంలో ఈ స్థాయి వసూళ్లు కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ గా చెప్పుకోవచ్చు.
మలయాళ ప్రేక్షకులతో పాటు మీడియా వర్గాల వారు '2018' సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి సినిమాలు తీస్తే తప్పకుండా సక్సెస్ అవుతాయి... ఇలాంటి సినిమాలే కదా మాకు కావాల్సింది అంటూ మలయాళ ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
ఆకట్టుకునే విజువల్స్ తో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ మనసుకు హత్తుకునే విధంగా ఉండటంతో 2018 సినిమాకు మంచి టాక్ లభించింది. భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్నాయి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డీసెంట్ ఓపెనింగ్ ను దక్కించుకోవడంతో ముందు ముందు భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ను డబ్ చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.