Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల చిట్టి రోబో 2 డేస్ కలెక్షన్స్

By:  Tupaki Desk   |   1 Dec 2018 8:31 AM GMT
తెలుగు రాష్ట్రాల చిట్టి రోబో 2 డేస్ కలెక్షన్స్
X
సూపర్ స్టార్ రజనీకాంత్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన '2.0' గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రూ. 12.69 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తో సరిపెట్టుకున్న ఈ చిత్రం రెండో రోజు మరో ఆరు కోట్ల షేర్ ను రాబట్టింది. ఒక సాధారణ రజనీకాంత్ సినిమాకు ఇవి మంచి కలెక్షన్స్ అయినప్పటికీ '2.0' కు మాత్రం కాదు. కారణం ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిందని అందరికీ తెలిసిందే.

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను భారీ ధరకు అమ్మడం జరిగింది కాబట్టి టార్గెట్ రీచ్ కావడానికి ఈ కలెక్షన్స్ సరిపోవు. ఈ సినిమాకు లాంగ్ రన్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది గానీ అలా జరగని పక్షంలో బయ్యర్లకు.. డిస్ట్రిబ్యూటర్లకు ఇబ్బంది తప్పదు. ఈ సినిమా 3D వెర్షన్ కు డిమాండ్ భారీగా ఉందని.. 2D వెర్షన్ స్క్రీన్స్ లో ఫుట్ ఫాల్స్ తక్కువగా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం - 7.42 cr

సీడెడ్ - 2.74 cr

ఉత్తరాంధ్ర - 2.48 cr

ఈస్ట్ - 1.43 cr

వెస్ట్ - 1.08 cr

కృష్ణ - 1.07 cr

గుంటూరు - 1.44 cr

నెల్లూరు - 0.96 cr

ఏపీ + తెలంగాణా టోటల్: రూ.18.62 కోట్లు(షేర్)

Disclaimer: Data Gathered From Various Confidential Sources And May Also Include Estimates We Dont Gaurantee any Aunthenticity Of The Same