Begin typing your search above and press return to search.

చైనాకు రెడీ అవుతున్న చిట్టి రోబో

By:  Tupaki Desk   |   2 March 2019 5:19 PM IST
చైనాకు రెడీ అవుతున్న చిట్టి రోబో
X
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన 2.0 ఇక్కడ ఎప్పుడో ఫైనల్ రన్ పూర్తి చేసుకుంది కానీ ఇంకా విదేశాల్లో విడుదల కావాల్సి ఉంది. త్వరలో తెలుగులో ఓ శాటిలైట్ ఛానల్ లో రాబోతున్న 2.0 అఫీషియల్ డిజిటిల్ పార్ట్ నర్ గా చెప్పుకున్న అమెజాన్ ప్రైమ్ లో ఇంకా రిలీజ్ కాకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా 2.0 చైనాలో భారీ ఎత్తున ప్రమోట్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది లైకా సంస్థ. అయితే టైటిల్ మార్చడం విశేషం.

మన దగ్గర జస్ట్ 2.0 అన్నారు కానీ చైనా వెర్షన్ కు పెట్టిన పేరు "బాలీవుడ్ రోబో 2.0-రీసర్జెన్సెన్స్". మే 2019లో చైనావ్యాప్తంగా రెండు వేలకు స్క్రీన్లలో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. రజనీకాంత్ కు చైనాలో ఇది అతి పెద్ద రిలీజ్ గా నిలవబోతోంది. నిజానికి 2.0 ఇండియాలో కాస్ట్ పరంగా ఫెయిల్యూర్ గా నిలిచింది. పెట్టుబడి పెట్టిన 400 కోట్లు వెనక్కు ఇవ్వలేకపోయింది. తెలుగు వెర్షన్ లో 25 కోట్లు తమిళ్ లో సుమారు 40 కోట్ల దాకా బయ్యర్లకు నష్టాన్ని ఇచ్చిన 2.0 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

ఓ మోస్తరుగా పిల్లలను ఆకట్టుకోబట్టి సరిపోయింది కానీ లేదంటే ఫలితం ఇంకా బ్యాడ్ గా వచ్చేది. చైనాలో ఇండియన్ సినిమాలకు ఇప్పుడు మంచి ఆదరణ దక్కుతోంది. దంగల్-సీక్రెట్ సూపర్ స్టార్-బాహుబలి-మగధీర లాంటివి అక్కడ భారీ వసూళ్లు రాబట్టాయి. ఎమోషన్స్ కు పట్టం గట్టే చైనీయులు దాని కంటే ఎక్కువ గ్రాఫిక్స్ మీదే ఆధారపడ్డ 2. 0ని ఏ మేరకు ఆదరిస్తారో వేచి చూడాలి