Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: చిట్టి క్రేజు ఇట్టా ఉంది!

By:  Tupaki Desk   |   30 Nov 2018 12:13 PM GMT
ఫోటో స్టొరీ: చిట్టి క్రేజు ఇట్టా ఉంది!
X
సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆ క్రేజ్ కొనసాగుతూ ఉంటుంది. తాజాగా '2.0' విడుదల కావడంతో తమిళనాడుకు రజనీ కి ఫీవర్ వచ్చేసింది. సినిమా కటౌట్లకు పాలాభిషేకాలు.. దండలు లాంటివి కామనే. కొంతమంది ఫ్యాన్స్ '2.0' విజయం కోసం రీసెంట్ గా నేలపై అన్నం తిన్నారు. ఇది వింతే.

ఇక చెన్నైలో ఒక రజనీ ఫ్యాన్ తన ఆటోను పూర్తిగా '2.0' స్టైల్లోకి మార్చాడు. అటో కు అన్నివైపులా ఫోన్లను అతికించాడు.. అటూ ఇటూ సిల్వర్ కలర్ రెక్కలు.. పైన రజనీ పోస్టర్.. 360 డిగ్రీలలో చుట్టూ బొమ్మ గన్లు పెట్టాడు. ఇలా కస్టమైజ్ చేసిన ఆటోలో స్టైల్ గా కూర్చుని పోజిచ్చాడు. చూడగానే అందరినీ ఆకట్టుకునేలా ఉన్న ఈ 2.0 ఆటో ఫోటో ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ అయింది.ఈ ఫోటోను రజనీ ఫ్యాన్స్ లైకులతో.. షేర్లతో హోరెత్తిస్తున్నారు.

రజనీ గత చిత్రాలు రెండూ సాధారణ ప్రేక్షకులతో పాటూ రజనీ ఫ్యాన్స్ సహనానికి కూడా పరీక్ష పెట్టాయి. ఈ సినిమాలో అలా కాకుండా కొన్ని ఫ్యాన్ మూమెంట్స్ ఉండడం.. పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.