Begin typing your search above and press return to search.

సైలెంట్ అయితే ఎలా చిట్?

By:  Tupaki Desk   |   1 Dec 2018 10:08 AM GMT
సైలెంట్ అయితే ఎలా చిట్?
X
2.0 మొదటి నాలుగు రోజుల వసూళ్లకు ఢోకా లేదని తేలిపోయింది. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో పాటు 3డి పేరుతో జరుగుతున్న స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రచారం ఫ్యామిలీస్ ని బాగానే థియేటర్లకు రప్పిస్తోంది. కానీ అసలైన ఛాలెంజ్ సోమవారం మొదలవుతుంది. ఇప్పటిదాకా ప్రమోషన్ విషయంలో లైకా అంత యాక్టివ్ గా లేని మాట వాస్తవం. హైదరాబాద్ లో చేసిన ప్రెస్ మీట్ తప్ప తెలుగు వెర్షన్ కు జరిగిన పబ్లిసిటీ ఏమి లేదు. శంకర్ ఇమేజ్ తో పాటు రజని స్టార్ పవర్ ఇంత ఓపెనింగ్స్ రావడానికి కారణమయ్యాయి. కానీ ఇవన్నీ వీకెండ్ వరకే ఉపయోగపడతాయి.

ఆ తర్వాత ఎదురయ్యే సవాల్ ని ఎదురుకోవాలి అంటే జనం ఓ రెండు వారాల పాటు 2.0 గురించే చర్చించేలా పబ్లిసిటీ వేగాన్ని పెంచాలి. పిల్లల్ని ఆకర్షిస్తే ఆటోమేటిక్ గా పెద్దల టికెట్లు తెగుతాయి. కానీ చిట్టి రోబో లాంటి అంశాలు ఉన్నా వాటిని ప్రచారానికి వాడుకునే విషయంలో పూర్తిగా ధ్యాస పెట్టడం లేదు టీమ్. మౌత్ పబ్లిసిటీ అంతా చూసుకుంటుంది అనే ధీమా 2.0 విషయంలో పనికి రాదు. సుమారు 70 కోట్లకు పైగా పెట్టుబడులు 2.0 మీద తెలుగు రాష్ట్రాల్లో పెట్టారు. అంత మొత్తం షేర్ రూపంలో రావాలి అంటే మూడు వారాలకు పైగా నాన్ స్టాప్ హౌస్ ఫుల్స్ తో బ్లాక్ బస్టర్ టాక్ రన్ అవ్వాలి.

కానీ 2.0 మీదున్నది మిశ్రమ స్పందనే. సీక్వెల్ కాబట్టి రోబో స్థాయిలో ఇందులో చాలా అంశాలు లేవే అనే ఫీడ్ బ్యాక్ సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో లైకాతో పాటు తెలుగు వెర్షన్ కొన్న నిర్మాతలు కాస్త ప్రమోషన్ మీద ఫోకస్ పెంచితే బెటర్. అలా కాదని జనమే సినిమాను మోస్తారనే లెక్కలో ఉంటె తేడా మండే నుంచే కనిపిస్తుంది. 2.0లో ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టే టాక్ డివైడ్ అయ్యింది. ఇప్పుడు వసూళ్లను కాపాడుకోవాలి అంటే సోమవారం నుంచి కూడా జనం దీని గురించే ఆలోచించేలా హైప్ కంటిన్యూ చేయాలి. చిట్టి చూస్తే పెద్దగా సౌండ్ చేయడం లేదు. రజని పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ పాల్గొనే అవకాశాలు తక్కువే. దీని ఎఫెక్ట్ తెలియాలంటే బుధవారం దాకా ఆగితే బెటర్