Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్: రౌడీగారి రెండు నిముషాల కిస్సు

By:  Tupaki Desk   |   8 May 2019 10:59 AM GMT
హాట్ టాపిక్: రౌడీగారి రెండు నిముషాల కిస్సు
X
విజయ్ దేవరకొండ కు టాలీవుడ్ సెన్సేషన్ అని.. రౌడీ హీరో అని పేర్లు ఉన్నాయి. వీటితో పాటు టాలీవుడ్ ఇమ్రాన్ హాష్మి అనే పేరు కూడా ఉంది. స్క్రీన్ పై హీరోయిన్ల తో లిప్పులు లాక్ చేయడం విజయ్ దేవరకొండకు వెన్నతో పెట్టిన విద్య. 'అర్జున్ రెడ్డి' నుంచి మొదలైన ఈ ఆధర చుంబనాల ట్రెండ్ చెక్కు చెదరకుండా దేవరకొండ కు ముద్దుల ప్రియుడు అనే ఇంకో టైటిల్ ఇచ్చే దిశగా కొనసాగుతోంది.

ప్రస్తుతం పరిస్థితి ఎలాఉందంటే విజయ్ దేవరకొండ సినిమాలో లిప్పు లాకు లేకపోతే కామన్ ఆడియన్స్ కూడా 'అవునా?' అంటూ ఆశ్చర్యపోయేలా ఉన్నారు.. ఇక రౌడీగారి ఫ్యాన్స్ అయితే మాకు ఘాటు లిప్ లాప్ ఒకటి కావాలని డిమాండ్ చేసేలా కూడా ఉన్నారు. విజయ్ తాజా చిత్రం 'డియర్ కామ్రేడ్' లో రష్మికతో లిప్ లాక్ టీజర్ కే హైలైట్ గా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో చేస్తున్నాడు కదా. ఈ సినిమాలో కూడా లిప్ లాక్ ఉందట. టాలీవుడ్ ను హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్ళేవరకూ నిద్రపోనని కంకణం కట్టుకున్నాడేమో విజయ్.

అయినా లిప్ లాక్ టాలీవుడ్ కు కామన్ కదా మరి అందులో ప్రత్యేకత ఏముందని మీరు అడగొచ్చు. సేమ్ అనుమానం ఫిలిం మేకర్స్ కూడా వచ్చిందేమో.. ఈ సినిమాలో ఏకంగా రెండు నిముషాల పాటూ సా..గే సుదీర్ఘమైన లిప్పు కిస్సును పెట్టారట. ఈ కిస్సు ఎంతో కళాత్మకంగా.. ఆడియన్స్ కు అర్జున్ రెడ్డి ని గుర్తుకు తెచ్చేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి ఈ లిప్పు లాకును అందుకుంది ఎవరో తెలియదు. ఈ సినిమాలు రాశి ఖన్నా తో పాటు మరో ఇద్దరు హీరోయిన్ లు ఉన్నారు. మరి ఆ పెదవితాళం ఎవరికి పడిందో ఏంటో.. అసలే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్.. ఆ ఇన్సైడ్ టాక్ చెప్పేవాళ్ళు సగమే చెప్తారు. చెప్పేది క్లియర్ గా మొత్తం చెప్పొచ్చుగా