Begin typing your search above and press return to search.
ఒక్క బిలియన్ కాదు వైకుంఠపురంలో 2 బిలియన్స్
By: Tupaki Desk | 17 April 2021 12:04 PM ISTఅల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురంలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత ఏడాది టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మూవీగా అల వైకుంఠపురంలో నిలిచింది. ఆ సినిమా సెన్షేషనల్ సక్సెస్ కు ప్రధాన కారణం ఆ సినిమా పాటలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్బుతమైన పాటలను థమన్ అందించాడు. సౌత్ ఇండియాలో ఏ మూవీ ఆల్బం కూడా బిలియన్ వ్యూస్ ను దక్కించుకోలేక పోయింది. కాని అల వైకుంఠపురంలోని ప్రతి ఒక్క పాట కూడా చాలా బాగుండటం వల్ల ఈ సినిమా ఆల్బం కొన్ని నెలల క్రితమే బిలయన్ వ్యూస్ ను యూట్యూబ్ లో దక్కించుకుని రికార్డు సృష్టించిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరో అరుదైన రికార్డు వైకుంఠపురంలో ఖాతాలో జమ అయ్యింది.
అల వైకుంఠపురంలో సినిమా ఆల్బం అన్ని మాటల వ్యూస్ కలిపి రెండు బిలియన్ లను క్రాస్ చేసింది. దక్షినాది నుండి అతి తక్కువ సమయంలోనే బిలియన్ మార్క్ ను క్రాస్ చేసిన ఆల్బంగా ఈ చిత్రం నిలిచింది. హాలీవుడ్ లో కూడా బుట్ట బొమ్మ పాట సందడి చేయడంతో పాటు దాదాపు అన్ని పాటలకు కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం వల్ల ఈ రికార్డు నమోదు అయ్యింది అనడంలో సందేహం లేదు. బుట్ట బొమ్మ పాట టిక్ టాక్ లో అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది. ఇక యూట్యూబ్ లో అల వైకుంఠపురంలో సినిమా ఆల్బం దాదాపుగా ఏడాది పాటు ట్రెండ్ అయ్యింది.
ఇంతటి సంచలన ఆల్బం ఇచ్చిన థమన్ ప్రస్తుతం సౌత్ లోనే టాప్ గా కొనసాగుతున్నాడు. అల వైకుంఠపురంలో ఆల్బం కారణంగానే థమన్ రేంజ్ అమాంతం పెరిగి పోయింది. మాస్ మరియు క్లాస్ ఇలా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే సత్తా ఉండటం వల్ల థమన్ కు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. అల వైకుంఠపురంలో వంటి మరో ఆల్బం థమన్ ఖాతాలో పడితే ఖచ్చితంగా ఆయన మరో లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోవడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం థమన్ చేతిలో లెక్కకు మించిన సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా రెండు బిలియన్ ల కారణంగానే అనడంలో ఎలాంటి సందేహం లేదు.