Begin typing your search above and press return to search.

మళ్లీ వార్తల్లో 1980 హీరోయిన్స్‌

By:  Tupaki Desk   |   14 July 2021 8:00 PM IST
మళ్లీ వార్తల్లో 1980 హీరోయిన్స్‌
X
సినిమా పరిశ్రమలో ఎంతో మంది కొత్త వారు పరిచయం అవుతూ ఉంటారు.. పాత వారు వెళ్లి పోతూ ఉంటారు. కాని కొందరు మాత్రం అలా ఎప్పటికి నిలిచి పోతూ ఉంటారు. అది ప్రేక్షకులకు అయినా సినిమా సెలబ్రెటీలకు అయినా అనడంలో సందేహం లేదు. అలా గుర్తుండి పోయే వారితో ప్రతి ఏడాది సెలబ్రేషన్‌ చేసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేసిన వారే 1980 స్టార్స్‌. అప్పట్లో హీరోలుగా హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలిగిన వారు ఇప్పుడు కొందరు రిటైర్డ్‌ అయ్యారు.. కొందరు ఇంకా సినిమాలు చేస్తున్నారు. ఈ స్టార్స్‌ రెగ్యులర్‌ గా కలుస్తూ ఎంజాయ్‌ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు విదేశాల్లో కూడా ఎంజాయ్‌ చేశారు.

కరోనా కారణంగా 1980 రీ యూనియన్ కు సాధ్యం కావడం లేదు. అందరు వయసు పెరిగిన వారు అవ్వడం వల్ల బయటకు వెళ్లడం ఏమాత్రం శ్రేయష్కరం కాదు. అందుకే రీ యూనియన్‌ ప్లాన్‌ ఏమీ చేయడం లేదు. కాని తాజాగా చెన్నైలో ఉన్న వారి వరకు 1980 స్టార్స్ రీయూనియన్‌ అయ్యారు. కొద్ది మంది మాత్రమే గెట్ టు గెదర్‌ అయ్యి సరదాగా టైమ్ స్పెండ్‌ చేశారు. వీకెండ్‌ ను ఎంజాయ్‌ చేసినట్లుగా రాధిక సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసింది.

ఈ గెట్ టు గెదర్ లో రాధిక, రాధ, సుమలత, సుహాసిన, అంభిక, పూర్ణిమా, భాగ్యరాజ్‌, లిజి, రఘు ఇంకా కొందరు ఉన్నారు. వీరు మాత్రమే కొంత సమయంను ఎంజాయ్‌ చేశారు. చాలా రోజుల తర్వాత కలిసిన నేపథ్యంలో వారు సంతోషం గా తమ లాక్ డౌన్‌ అనుభవాలు మరియు ఇతర విషయాల గురించి మాట్లాడుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటోలు తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. ఖుష్బు రాధిక ట్వీట్‌ కు స్పందిస్తూ చాలా ఎంజాయ్ చేశామని రీ ట్వీట్‌ చేసింది.